మేనల్లుడుతో మేనత్త..స్కూల్ నుంచి లాడ్జికి.

  0
  42389

  ఆడ పుట్టుక పుట్టిన ఆ మ‌హిళ స్త్రీ జాతికే త‌ల‌వంపులు తెచ్చింది. 14 ఏళ్ళ వ‌య‌సున్న మేన‌ల్లుడితో లైంగిక సంబంధం పెట్టుకుంది. ఆ త‌ర్వాత అస‌లు క‌ధ మొద‌లుపెట్టింది. హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబ‌ర్ 10లోని గాయ‌త్రి హిల్స్ లో నివ‌సించే ఓ ఇంట్లో బంగారు న‌గ‌లు మాయ‌మ‌య్యాయి. న‌గ‌లు క‌నిపించ‌క‌పోవ‌డంతో ఇల్లంతా వెతుకుతున్న త‌ల్లికి తాను ఒక దండ తీసి మేన‌త్త‌కి ఇచ్చాన‌ని 14 ఏళ్ళ కొడుకు చెప్పాడు. ఎందుకిచ్చావ‌ని త‌ల్లి ప్ర‌శ్నిస్తే, అస‌లు విష‌యం బైట‌ప‌డింది. 14 ఏళ్ళ మేన‌ల్లుడిని వ‌ల‌లో వేసుకున్న ఆ మ‌హిళ.. త‌న భ‌ర్త ఇర్ఫాన్ తో క‌లిసి బెంగుళూరు నుంచి వ‌చ్చి హోట‌ల్ లో దిగేది.

  మేన‌ల్లుడు చ‌దువుతున్న స్కూల్ కి వెళ్ళి త‌న‌తో పాటు తీసుకుపోయి లాడ్జిలో త‌న కామ‌వాంఛ‌లు తీర్చుకునేది. దీన్నంతా భ‌ర్త ఇర్ఫాన్ వీడియో తీసేవాడు. ఆ త‌ర్వాత ఆ పిల్ల‌వాడికి వీడియోలు చూపించి ఇంట్లో నుంచి బంగారు న‌గ‌లు, డ‌బ్బులు తీసుకురాక‌పోతే వీడియోలు బ‌య‌ట‌పెడ‌తానంటూ ఆ పిల్లాడిని భ‌య‌పెట్టేది. దీంతో బంగారు న‌గ‌ల‌తో పాటు ఆరు ల‌క్ష‌ల రూపాయ‌లు చోరీ చేసి మేన‌త్త‌కి ఇచ్చాడు. మూడు ద‌ఫాలు త‌న‌ను స్కూల్ నుంచి లాడ్జికి తీసుకెళ్ళి త‌న‌తో కోరిక‌లు తీర్చుకుంద‌ని కొడుకు త‌ల్లికి చెప్పేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో జూబ్లిహిల్స్ పోలీసులు ఆమెను, ఆమె భ‌ర్త‌ను అరెస్టు చేసి ఫోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసి జైలులో పెట్టారు.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.