కృష్ణుడు పిలిచాడు.. నే వెళ్తున్నా..

    0
    668

    సీనియర్ ఐపీఎస్ అధికారిణి భారతి అరోరా సంచల నిర్ణయం తీసుకుంది. వాలంటరీ రిటైర్మెంట్ కు ఆమె అప్లికేషన్ పెట్టుకుంది. తీరా దానికి ఆమె చెప్పిన కారణం చూసి అందరూ షాకయ్యారు. ఇంతకీ ఆమె చెప్పిన కారణం ఏంటో తెలుసా..?


    సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి భారతి అరోరా 2007 సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ పేలుడుపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)కు నాయకత్వం వహించారు. ఆ కేసు ద్వారా ఆమె బాగా ఫేమస్ అయ్యారు. భారతీ అరోరా భర్త వికాస్‌ అరోరా సైతం ఐపీఎప్‌ అధికారి. 1998 బ్యాచ్‌కు చెందిన భారతి అరోరా ప్రస్తుతం అంబాలా రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆమె స్వచ్ఛంత పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు ఆమె చెప్పిన కారణంగా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. భగవాన్‌ ‘శ్రీకృష్ణుడి సేవ’కు అంకితమయ్యేందుకు కోసం స్వచ్ఛందంగా పదవీ విరమణ కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీకి దరఖాస్తు పంపారు.

    ‘సేవ చేయడం నా అభిరుచి, నాకు గర్వకారణం. ప్రస్తుతం నేను జీవితంలోని అంతిమ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాను. గురునానక్‌ దేవ్‌, చైతన్య మహాప్రభు, కబీర్‌దాస్‌, తుల‌సీదాస్, సుర్దాస్‌, మీరాబాయి, సూఫీ సాధువులు చూపిన మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. శ్రీకృష్ణుడి సేవకు నా జీవితాన్ని అంకితం చేస్తాను’ లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘తాను కొన్ని సంవత్సరాలుగా సేవామార్గాన్ని వదిలి.. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలని ఆలోచిస్తున్నానని ’ అని తెలిపారు. రాజకీయాల్లో చేరే ఉద్దేశం తనకు లేదని, ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపేందుకు స్వచ్ఛంద పదవీ విరమణ కోరినట్లు స్పష్టం చేశారు.

    ప్రస్తుతం వీఆర్‌ఎస్‌ కోరుతూ భారతి అరోరా చేసుకున్న దరఖాస్తును హర్యానా హోంశాఖ మంత్రి అనిల్‌ విజ్ వద్దకు చేరింది. అనిల్‌ విజ్‌ 2009లో అంబాలా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేసినందుకు ఆయనను అరెస్టు చేయాలని భారతి ఆదేశించారు. ప్రస్తుతం ఆమె స్వచ్ఛంద పదవీ విరమణ ఫైల్‌ ఆయన వద్దకే చేరుకోవడం కొసమెరుపు.

     

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?