2024 వరకు ఏపీకి రాజధాని హైదరాబాదే..

    0
    109

    ఏపీకి రాజధాని అమరావతా కాదా అని చాలామంది టెన్షన్ పడిపోతుంటే.. మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం నింపాదిగా ఏపీ రాజధాని హైదరాబాద్ అంటూ షాకిచ్చారు. అవును, విభజన చట్టం ప్రకారం 2024 వరకు ఏపీ, తెలంగాణకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటూ కుండబద్దలు కొట్టారు.

    శాసనసభ చట్టాలను చేయవద్దంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించిన బొత్స, రాజ్యాంగానికి లోబడే వ్యవస్థ అయినా పని చేయాలన్నారు. 2024 వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాదు అని చట్టం చేశారని, శివరామకృష్ణ కమిటీని వేసి రాజధాని నిర్ణయం తీసుకోవాలన్నారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు నారాయణ కమిటీ వేసి నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఆ ప్రకటన పార్లమెంట్‌ కు పంపలేదన్నారు, కాబట్టి హైదరాబాదే 2024 వరకు ఏపీకి రాజధాని అని క్లారిటీ ఇచ్చారు బొత్స. గత ప్రభుత్వం రాజధాని వ్యవహారం లో చట్టబద్ధంగా వ్యవహరించలేదని, పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేస్తున్నామన్నారు బొత్స.

    టీడీపీ వారికి ఆవేశం ఎక్కువని, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటారని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు ఎప్పుడు ప్రజల కోసం, దీర్ఘకాల నిర్ణయాలు తీసుకోరని విమర్శించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి బొత్స నారాయణ సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు స్వార్ధం కోసం నిర్ణయాలు తీసుకుంటారు.ప్రజల కోసం, దీర్ఘకాల నిర్ణయాలు వారు తీసుకోరని మండిపడ్డారు.

     

    ఇవీ చదవండి… 

    బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

    మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

    నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

    తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..