హమ్మయ్య ,పెళ్లయింది..ఇక చావుకి భయపడం..

  0
  178

  యుద్దానికి పోయే ముందు పెళ్లిచేసుకొని , భార్యచేత వీరతిలకం దిద్దించుకొని పోవడం.. చాలా జానపద , పురాణ , మరియు చరిత్రలో చదివాం.. వాటిని నమ్మినా నమ్మకపోయినా , ఇప్పుడు ఉక్రెయిన్ లో జరుగుతున్న ప్రేమ, పెళ్లిళ్లు వెనుక కన్నీటికథలున్నాయి.. త్యాగం ఉంది.. అజరామరమైన ప్రేమ ఉంది.. ప్రేమలో ఇంత పవిత్రత ఉందా , అలాంటి ప్రేమను దేశభక్తి పునీతం చేస్తుందా ?? ఈ ప్రశ్నలకు సమాధానమే ఉక్రెయిన్ లో జరుగుతున్న ప్రేమ పెళ్లిళ్లు.. రష్యా దాడిలో ఉంటామో , పోతామో తెలియక , ప్రేమ జంటలు పెళ్లిళ్లు చేసుకుంటున్నాయి. యుద్ధంలో మరణించినా , తమ ప్రేమను సార్ధకం చేసుకోవాలని ఇలా చేస్తున్నారు. వీరిలో సైనికులు కూడా ఉన్నారు.

  ఉక్రెయిన్ లోని రివినే ప్రాంతంలో విధుల్లో ఉన్న ఇద్దరు సైనికులు ప్రేమికులు.. యుద్ధంలో బ్రతుకుతామో , చచ్చిపోతామో అన్న అనుమానంతో , ఇద్దరూ సైనిక పహారా కాస్తుండగానే , మిలిటరీ యూనిఫారంలోనే , పెళ్లి చేసుకున్నారు. వీధిలోనే ఒక పుష్ప గుచ్ఛం తో , పెళ్లి అయిపోయింది.. తర్వాత ఇద్దరూ ఎవరికి వారు , యుద్ధంలోకి వెళ్లిపోయారు. చూసే వాళ్లకు కన్నీళ్లు తెప్పించినా , వారిద్దరూ దేశంకోసం త్యాగంలో మరణించినా , తమ బంధం పరిపూర్ణం చేసుకోవాలని పెళ్ళాడమని చెప్పారు. బ్రతికి ఉంటే మళ్ళీ కలుసుకుందాంఅంటూ చివరి ముద్దుతో సాగిపోయారు.. సైనికులేకాకుండా చాలామంది పౌరులు కూడా తుపాకీకాల్పులు , బాంబుల మోతల మధ్య , తమ ప్రేమను పెళ్లితో ముగించేస్తున్నారు. బార్యాభర్తలుగానే చనిపోతామని చెబుతున్నారు..

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..