అన్నను తెలివిగా చంపినా చిక్కిపోయిన లేడీ డాక్టర్..

  0
  1757

  తండ్రి ఆస్తికోసం , అన్నను , మేనకోడలిని చంపి , వదినపై కూడా హత్యాయత్నం చేసిన , మహిళా డాక్టర్ కిన్నెరకు , గుజరాత్ లోని పతాన్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. దారుణమైన ఈ హత్యాకాండలో లేడీ డాక్టర్ తన కుట్రను తెలివిగా అమలుచేసినా , చివరకు తండ్రి అనుమానంతో , కూతురు రాక్షసత్వం బయటపడింది. కిన్నర , ఆమె అన్న , వదిన ముగ్గురూ డాక్టర్లే.. తండ్రి వ్యాపారం పనిమీద బయటకు వెళ్లిన సమయంలో , ఆమె అన్నకు , ఉమ్మెత్త విత్తనాలు కలిపిన రసాయనాన్ని కూల్ డ్రింక్ లో పోసి ఇచ్చింది. ఈ డ్రింక్ తాగిన అన్న జిగార్ స్పృహ కోల్పోయాడు. ఆ సమయంలో , తాను స్వంతంగా తయారుచేసిన సైనేడ్ క్యాప్సూల్ ని , అన్న నోట్లో వేసి , చనిపోయేట్టు చేసింది. సహజమరణంగా భావించి కర్మకాండ పూర్తి చేశారు.

  తరువాత 15 రోజులకు , అదేవిధంగా వదినకు కూడా ఉమ్మెత్త విత్తనాలు కలిపిన రసాయనాన్ని కూల్ డ్రింక్ లో పోసి ఇచ్చింది. ఆమె స్పృహ కోల్పోయిన పరిస్థితుల్లో హాస్పిటల్ కి తీసుకుపోయారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న అన్న కూతురు 14 నెలల మేనకోడలు నోట్లో సైనేడ్ మాత్ర పెట్టి చంపేసింది. హాస్పిటల్లో ఆమె వదిన వైద్య పరీక్షలో డాక్టర్లు , అనుమానం వ్యక్తంచేశారు. అదే సమయంలో ఇంట్లో చనిపోయిన బిడ్డ శవానికి పోస్టుమార్టం చేస్తే , విషప్రయోగం జరిగిందని తేలింది. దీంతో తండ్రి ఫిర్యాదు మేరకు , కొడుకు జిగార్ , శవాన్ని వెలికితీసి , పరీక్షచేస్తే , సైనేడ్ ప్రయోగించి చంపినట్టు తేలింది. కిన్నరను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా , ఆమె చేసిన నేరం ఒప్పుకుంది. న్యాయస్థానం ఇప్పుడు ఆమెకు యావజ్జీవ శిక్ష విధించింది..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..