హైదరాబాద్‌లో భోలక్ పూర్ ఎంఐఎం కార్పోరేటర్ మహ్మద్ గౌసుద్దీన్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. దీంతో ఆయనకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. రాత్రి గస్తీ చేస్తోన్న పోలీసులు.. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా హోటళ్ళు మూయకపోవడంపై ప్రశ్నించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కార్పోరేటర్ గౌసుద్దీన్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడుతూ అవమానకరంగా మాట్లాడారు.
ఇది నా ఏరియా.. ఇక్కడ నీ రూల్స్ నడవవు. 24 గంటలు దుకాణాలు తెరిచే ఉంటాయి. వచ్చిన వాడికి డ్యూటీ చేసుకుని పో.. తమాషాలు చేయద్దు అంటూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా మరో పోలీసును వంద తీసుకునేవాడిని నువ్వు కూడా మాట్లాడతావా .. మీ ఎస్సైని పిలువు, కార్పోరేటర్ వచ్చాడని చెప్పు.. అంటూ ఫైర్ అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు. సదరు కార్పోరేటర్ పై పోలీసులు యాక్షన్ తీసుకోవాలని, పోలీసుల సత్తా చూపించే సమయం ఇదేనంటూ ట్వీట్ చేస్తూ, ఆ వీడియోని డీజీపీకి పోస్ట్ చేశారు.
ఈ విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్ళడంతో .. కార్పోరేటర్ పై యాక్షన్ తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఉదయం సదరు కార్పోరేటర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సిబ్బందికి క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు, వారితో దురుసుగా ప్రవర్తించినందుకు గౌసుద్దీన్ పై కేసు నమోదు చేశారు.
A man is threatening Policemen in Telangana: How dare Police enter in his area? pic.twitter.com/G8mR5KR5mq
— Anshul Saxena (@AskAnshul) April 5, 2022