పురాణాల్లో పాలకడలి విశిష్టస్థానం ఉంది. పాలకడలిలో శేషపాన్పుపై విష్ణుమూర్తి పవళించి ఉంటారని కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ పాలకడలి కేవలం పురాణాల్లోని ఊహాకల్పన, కవుల సృష్టి అనుకునే వాళ్ళకు .. ఇప్పుడు నాసా ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలిపింది. ఫోటోలతో సహా దాన్ని విడుదల చేసింది. ఇండోనేషియాలోని దక్షిణ భాగంలో పాలకడలిని ఉపగ్రహం ఫోటో తీసిందని పేర్కొంది. అయితే ఇది పాలకడలి అంటే సముద్రంలో పాలు ఉంటాయని కాదు.. ఏడాదికి రెండుసార్లు… ఇండోనేషియాలోని దక్షిణ భాగం ప్రాంతం తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. రాత్రిళ్ళు కూడా కళ్ళు మిరుమిట్లు గొలిపేలా సముద్రం మెరిసిపోతూ ఉంటుంది.
గతంలో కూడా అమెరికాలో నావికా పరిశోధక బృందం 2019 ఆగస్టులో ఈ సముద్రంలో ఈ పరిణామాన్ని కనుగొనుంది. ఏడాదిలో రెండుసార్లు మాత్రమే ఇలా జరుగుతుంటుంది. అయితే ఆ ఏడాదిలో సముద్రంలో ఒక ప్రాంతంలో పాలు లాగా మెరిసిపోయే.. ఒక బ్యాక్టీరియా కారణంగా అలా కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ బ్యాక్టీరియాకు మిలమిట మెరిసే గుణం ఉందని, అవి సముద్రంలో వ్యాప్తి చెందినప్పుడు ఒకదానికొకటి అనుబంధంలా ఏర్పడి.. తెల్లగా మెరిసిపోతున్నట్లు కనిపిస్తాయని వెల్లడించారు. సముద్రగర్భంలో జరుగుతున్న మార్పులకు కూడా ఇది సంకేతంగా భావించాలని సూచిస్తున్నారు.