రెండో సారి అత్యాచారానికి దాన్నే తీసేస్తే..

  0
  246

  మ‌లేషియాలో ప‌దేప‌దే లైంగిక నేరాల‌కు పాల్ప‌డే వారిని, లైంగికంగా నిర్వీర్యం చేసే బిల్లుకు ఆ దేశ చ‌ట్ట‌స‌భ ఆమోద‌ముద్ర వేసింది. అయితే దీన్ని లైంగిక నేరాల‌కు పాల్ప‌డిన వారి అనుమ‌తితోనే చేయాల‌నే ఓ ష‌ర‌తు కూడా విధించారు. రెండో ద‌ఫా లైంగిక నేరానికి పాల్ప‌డి, జైలుకి వెళ్ళిన కీచ‌కులకు ఒక సైక్రియాట్రిస్ట్, మ‌రో వైద్యుడు ఆమోదం తీసుకుని లైంగిక నేరానికి పాల్ప‌డ్డ వ్య‌క్తి అనుమ‌తి కూడా తీసుకుని.. మందుల ద్వారా అత‌డిని లైంగికంగా నిర్వీర్యం చేస్తారు.

  మాన‌సిక ఉన్మాదం, శ‌రీరంలోని కొన్ని హార్మోన్లు అతిగా స్ర‌వించ‌డం వ‌ల్ల కొంత‌మంది లైంగిక ఉన్మాదులుగా మారుతున్నారు. ఇలాంటి వారిలో మితిమీరిపోతున్న లైంగిక కోరిక‌ల‌ను త‌గ్గించేందుకు టెస్టో స్టెరాన్స్ స్థాయిల‌ను త‌గ్గించాలి. ఇందుకోసం వారికి ఇంజెక్ష‌న్లు ఇస్తారు. ఈ ఇంజెక్ష‌న్లు ఇస్తే లైంగిక నేరాల‌కు పాల్ప‌డే వారి ర‌క్తంలో టెస్టో స్టెరాన్ స్థాయిలు త‌గ్గి.. ఆ నేరాల‌కు పాల్ప‌డే వారి సంఖ్య త‌గ్గుతుంద‌న్న‌ది ఈ బిల్లు ఉద్దేశం. దీనికి ఆ చ‌ట్ట‌స‌భ ఆమోదం తెలిపింది. మూడో ద‌ఫా లైంగిక నేరాల‌కు పాల్ప‌డే వారికి బ‌ల‌వంతంగా ఇంజెక్ష‌న్లు ఇచ్చి, నిర్వీర్యం చేస్తారు.

  ఇప్ప‌టికే ఇలాంటి శిక్ష‌లు ద‌క్షిణ‌కొరియా, పాకిస్తాన్, పోలెండ్, అమెరికాలోని 8 రాష్ట్రాలు, నార్వే, డెన్మార్క్, జ‌ర్మ‌నీలో కూడా ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని దేశాల్లో లైంగిక నేరాల‌కు పాల్ప‌డే వారిని, వారి అనుమ‌తితో సంబంధం లేకుండా ఆప‌రేష‌న్ ద్వారా వారి మ‌ర్మాంగాల‌ను తొల‌గించే అవ‌కాశ‌ముంది. అలాంటి బిల్లు ప్ర‌వేశ‌పెట్టాల‌ని మ‌లేషియాలో ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక్కోద‌ఫా ఇంజెక్ష‌న్లు ప‌ని చేయ‌వ‌ని, అందువ‌ల్ల ఆప‌రేష‌న్ ద్వారానే లైంగిక అవ‌య‌వాలు తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.