అర్ధరాత్రి డిస్కౌంట్స్ సేల్స్ షాపింగ్ మాల్స్ లో కస్టమర్లను ఆకర్షించడంతో ఇదో వికృతమైన స్కీమ్. కేరళలో కొచ్చిన్, త్రివేండ్రం పట్టణాల్లోనే లులు షాపింగ్ మాల్స్ లో ఈ స్కీమ్ ఏర్పాటు చేయడంతో వందలు, వేలు కాదు లక్షల మంది కస్టమర్లు షాపింగ్ మాల్స్ లోకి పోటెత్తుతున్నారు. అర్ధరాత్రి సమయంలో సెక్యూరిటీ లేకుండా అతి విశాలమైన ఈ షాపింగ్ మాల్స్ లోకి కస్టమర్లను వదిలేస్తున్నారు.
దాదాపు 17 ఎకరాల్లో పలు అంతస్థుల భవనాలతో ఉన్న ఈ షాపింగ్ మాల్ లోకి కస్టమర్లు పోటెత్తుతున్నారు. అప్పుడప్పుడు 50 శాతం డిస్కౌంట్‌తో లులు మాల్స్ లో వస్తువులు అమ్ముతుంటారు. దీంతో 50 శాతం డిస్కౌంట్‌కే సామాగ్రిని తీసుకుపోవాలని కస్టమర్లు రాత్రి ఏడు, ఎనిమిది గంటల నుంచే రోడ్ల మీద తచ్చాడుతుంటారు. కరోనా విజృంభణ మళ్ళీ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న తరుణంలో గత రెండు రోజులుగా త్రివేండ్రం, కొచ్చిన్ నగరాల్లో లులు మాల్స్ మళ్ళీ మిడ్ నైట్ సేల్ ఆఫర్ పెట్టింది.
తెల్లవారుజాము వరకు ఒక్కో షాపింగ్ మాల్‌లో రెండు లక్షల మందికి పైగా కస్టమర్లు పోటెత్తారు. అధికారులకు దీనిపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా లులు మాల్స్ మిడ్ నైట్ డిస్కౌంట్లు ఆపాలని కోరుతున్నారు. మిడ్ నైట్ డిస్కౌంట్ సేల్స్ లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తుండడంతో జనం ఎగబడుతున్నారు. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే పెద్ద ప్రమాదమే సంభవించే అవకాశముంది.
शॉपिंग की दीवानगी समझ आती है पर जूनुन की हद तक..वो भी जान जोखिम में डालकर शॉपिंग…
ग़ज़ब ही है..
वीडियो केरल के #Lulumall का बताया जा रहा, जहाँ #MidnightSale चल रही थी।
(VCSM) pic.twitter.com/VeKFjx7cYt— Anshuman Sharma (@anshuman_sunona) July 9, 2022