పెళ్ళికిముందు , పెళ్లిపీటలపైనా పెళ్లి కూతుళ్ళు చేసే దుర్మార్గాలు అంతాఇంతాకాదు.. ఒకచోటకాదు , దేశంలో అన్నిచోట్లా , చాలామంది పెళ్లికూతుళ్ళు , పెళ్ళికిముందు పారిపోవడం, పెళ్లితరువాత లేచిపోవడమో జరిగే నేటి పరిస్థితుల్లో , ఓ అమ్మాయి ప్రియుడికి ఛాలెంజ్ విసిరింది.. దమ్ముంటే , పెళ్ళిసమయానికి వచ్చి తనకు తాళికట్టమని కోరింది. పెళ్లిపీటల పైకి పోబోయే ముందే , ప్రియుడికి టైం తో సహా మెస్సేజ్ పెట్టి రమ్మంది.
బీహార్ లోని నలంద జిల్లా ముబార్కాపూర్ గ్రామంలో ముకేశ్ అనే యువకుడికి గ్రామానికే చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆ యువతికి , వేరే యువకుడితో పెళ్ళికుదిరింది. పెళ్లి జరిగే సమయంలో , ఇక పెళ్ళికొడుకు , అమ్మాయి నుదుట కుంకుమ పెట్టి , వివాహకార్యక్రమం మొదలుపెట్టపోతుండగా , ప్రియుడు ముకేశ్ సినిమా స్టైల్లో మరో ఫ్రెండ్ తో , పెళ్లి మండపానికి వచ్చేశాడు.
పెళ్లికూతురు నుదుట కుంకుమ పెట్టమని , పురోహితుడు , కుంకుమ ఇస్తుండగా , ప్రియుడు ముకేశ్ , పెళ్ళికొడుకుని పక్కకులాగేసి , తానే ఆ కుంకుమను లాక్కొని , పెళ్లికూతురు నుదుట పెట్టేసి , ఆమెను భార్యను చేసుకున్నాడు., దీంతో బంధువులంతా , ముకేశ్ పై దాడిచేసి కొట్టారు. తీవ్రగాయాలతో అతడిని హాస్పిటల్లో చేర్చారు. అసలైన పెళ్ళికొడుకు తనకు పెళ్లివద్దంటూ వెళ్ళిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు , ముకేశ్ ని , పెళ్లికూతురుని విచారిస్తే , ఒక పథకం ప్రకారమే తాము ఇలా చేశామని ఇద్దరూ ఒప్పుకున్నారు..