నిత్యానందస్వామి లీలలు అందరికీ తెలిసిందే. దేశం విడిచి విదేశాలకు పారిపోయిన నిత్యానంద… ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి.. దానికి ‘కైలాస’ అనే పేరు పెట్టారు. ప్రత్యేక కరెన్సీ కూడా తయారు చేసుకున్నాడు. తన దేశానికి రావాలంటే వీసా తీసుకోవాల్సిందేనని కూడా ఆర్డర్ కూడా జారీ చేశాడు. ఈ పుణ్యపురుషుడు అప్పట్లో హీరోయిన్ రంజితతో కామకేళీలు సాగించి వివాదాస్పదమయ్యాడు.
తాజాగా ఈ నిత్యానందనే పెళ్ళి చేసుకోవాలని ఉందంటూ హీరోయిన్ ప్రియా ఆనంద్ చెప్పడం సెన్సేషన్ అయింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించింది ప్రియా ఆనంద్. తెలుగులో లీడర్, రామ రామ కృష్ణ కృష్ణ, 180, కో అంటే కోటి అనే సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. రీసెంట్‌గా ఓ ఇంటర్వూలో తన మనసులో విషయాన్ని బయటపెట్టింది.
నిత్యానందస్వామిని ప్రేమిస్తున్నానని, ఆయనను పెళ్ళి చేసుకోవాలని ఉందంటూ చెప్పడం సంచలనంగా మారింది. ఆయన గురించి వ్యతిరేక ప్రచారాలు జరుగుతున్నా… ఆయనను నమ్మేవాళ్ళు ఆరాధించే వాళ్ళు ఉన్నారని, అందుకే నిత్యానందస్వామిని పెళ్ళి చేసుకోవాలని ఉందంటూ క్లారిటీగా చెబుతోంది. ప్రియా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.