డోలో డాక్టర్లకు వెయ్యి కోట్లు కమీషన్..

  0
  709

  డోలో , డోలో ..కరోనా టైంలో ఇదే పాట .. డాక్టర్లు , మందుల షాపులు, చివరకు పేషేంట్లు.. డోలో మాత్ర చాలాకాలంగా వాడకంలో ఉన్నప్పటికీ , కరోనా టైంలో పాపులర్ అయింది. అయితే ఇదే కెమికల్ కాంబినేషన్ తో ఉన్న ఇతర మాత్రలు మూలపడగా , ఇదొక్కటే అందరి నోళ్ళలో ఎందుకు నానిందో తెలుసా.. ? సింపుల్ గా , డాక్టర్లకు , మందుల షాపులకు ఇచ్చిన కమీషన్ ..అదెంతో తెలుసా..? అక్షరాలా వెయ్యి కోట్లు.. మైక్రో లాబ్స్ తయారుచేసే ఈ టాబ్లెట్ పాపులారిటీ సంగతెలా ఉన్నా , దానివెనుక మోసమే ఇప్పుడు , ఆ కంపెనీని ఇబ్బందుల్లోకి నెట్టింది.

  ఈ నెల 6 తేదీన ఆ కంపెనీపై ఇన్ కం టాక్స్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో వందల కోట్లలో అక్రమాలు , పన్ను ఎగవేసిన వ్యవహారాలు బయటపడ్డాయి. ఇప్పుడు తాజాగా , లెక్కలన్నీ చూస్తే , ఈ టాబ్లెట్ రాసినందుకు , అమ్మినందుకు , ప్రమోషన్ చేసినందుకు కమీషన్ కింద డాక్టర్లకు , మందుల షాపులకు వెయ్యి కోట్లు కమీషన్ ఇచ్చినట్టుతెలింది. దీంతో ఈ కంపెనీపై కేసు నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇదికాకుండా మరో 300 కోట్ల రూపాయలు తప్పుడు లెక్కలు చూపి టాక్స్ ఎగ్గొట్టినట్టు తేల్చారు..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.