చిరంజీవి , న్యూలుక్ దేనికోసమో చూడండి..

  0
  971

  మహేష్ కు పోటీగా మెగాస్టార్..

  డైరెక్ట్ చేస్తున్న సుకుమార్..

  మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్ లో అదరగొట్టాడు. నీట్ గా టక్ చేసుకొని.. కుర్రాడిలా మారిపోయాడు. ఇంతకీ చిరంజీవి ఇలా కుర్రాడిలా మారిపోవడానికి కారణం ఏమిటో తెలిస్తే మాత్రం షాకవుతారు. ఆయన ఇలా కొత్త లుక్ లోకి మారడానికి కారణం సినిమాల్లో వేసే గెటప్ కోసం కాదండోయ్. ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ యాడ్ కోసం ఆయన ఇలా రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇంకో విషయం ఏమిటంటే ఈ యాడ్ డైరెక్ట్ చేస్తున్నది కూడా ఎవరో కాదు.. ఇటీవల అల్లు అర్జున్ తో పుష్ప సినిమా తీసి, పాన్ ఇండియా హిట్ కొట్టిన సుకుమార్.. శుభ గృహ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కోసం ఈ యాడ్ ను సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ ఈ రోజు పూర్తయింది. త్వరలోనే ఈ యాడ్ లో మెగాస్టార్ కనిపించబోతున్నాడు.

  మెగాస్టార్ చిరంజీవి గతంలో కొన్ని ప్రకటనల్లో కనిపించారు. రాజకీయాల్లోకి రాకముందు శీతల పానీయాల ప్రచార వీడియోల్లో కూడా కనిపించారు. ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వచ్చినా ప్రకటనల్లో మాత్రం కనిపించలేదు. తాజాగా చిరంజీవి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రకటనల్లో నటించేందుకు ముందుకొచ్చాడు.

  అయితే ప్రస్తుతానికి టాలీవుడ్ లో మహేష్ బాబు ఎక్కువగా యాడ్స్ లో నటిస్తున్నాడు. అందరికంటే ఎక్కువగా మహేష్ ఒక్కడే పారితోషకం కూడా తీసుకుంటున్నాడు. ఇప్పుడు చిరంజీవి రాకతో వ్యాపార ప్రకటనల్లో వీరిద్దరి మధ్యనే పోటీ నడిచే అవకాశం కనిపిస్తోంది.

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.