భర్తకు భరణం ఇవ్వమని భార్యకు కోర్టు ఆదేశం..

    0
    366

    విడాకులు తీసుకున్న ఒక భార్యను , భర్తకు భరణం ఇవ్వమని నాందేడ్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను , బొంబాయి హైకోర్టు సమర్ధించింది. సాధారణంగా , విడాకుల కేసుల్లో భార్యలకు ,భర్తలు భరణం ఇవ్వాలి.. అయితే ఈ ప్రత్యేమైన కేసులో , భర్తకు భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించారు. ఈ కేసులో , భార్య భర్తలకు 1992 లో పెళ్లయింది. ఇద్దరు బిడ్డలు. పెళ్లయ్యే నాటికీ భార్య హైస్కూల్ చదువే..

    పెళ్ళైన తరువాత , భర్త , కష్టపడి , ఆమెను చదించించాడు. అలా , ఆమె ఎమ్మే , బీఈడీ వరకు చదివింది. భార్య కాలేజీ చదువులకు డబ్బుపెడుతూ , ఇద్దరు బిడ్డలను చూసుకునేవాడు. కూలి పనులు చేసుకొని భార్యను చదిచించి , కుటుంబాన్ని పోషించాడు. ఆమెకు టీచర్ గా ఉద్యోగం వచ్చింది. స్థాయితో పాటు , అహంకారం పెరిగింది. కూలివాడు తన భర్త అనిచెప్పుకునేందుకు ఇష్టపడకుండా , విడాకులకు కోర్టుకెక్కింది. తప్పుడు కేసులతో వేధించింది.

    విడాకుల సమయంలో కోర్టు , గత చరిత్ర చూసింది. ఇప్పుడు చిల్లిగవ్వ లేనిపరిస్తితుల్లో ఉన్న భర్త కు , నెలకు జీతం ఉంచి ఐదువేలు భరణం ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఆమె కోర్టు ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టులో కూడా కింది కోర్టు ఆదేశాలను సమర్దించి , పేదవాడైన భర్తకు , భరణం చెల్లించామని ఆదేశించింది..

     

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.