33 ఏళ్ళ క్రితం అవమాననాన్ని మెగాస్టార్ ఇలా..

    0
    194

    మెగాస్టార్ చిరంజీవి తన జీవితంలో ఎదుర్కొన్న ఒక ఘోరమైన అవమానాన్ని ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకలో ప్రస్తావించారు. ఈ అవమానం ఇంతకాలం తనను దహించిందని , దానికి ఇంత కాలానికి పరిష్కారం దొరికిందని కూడా చెప్పాడు . ఈ సందర్భంగా 1989లో జరిగిన ఓ సంఘటనను చిరంజీవి గుర్తు చేసుకున్నారు. రుద్రవీణ సినిమాకు తనకు నర్గీస్ దత్ అవార్డు లభించిన సందర్భంగా, 1989లో చిరంజీవి అవార్డు తీసుకునేందుకు ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ చిత్రాల అవార్డు గ్రహీతలకు సాయంత్రం తేనీటి విందు ఏర్పాటు చేసింది .

    ఆ సందర్భంగా భారతీయ చలనచిత్ర ప్రముఖులకు సంబంధించిన వీడియో వేస్తున్నారు. మరొకచోట భారతీయ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖుల ఫోటోలతో పోస్టర్లు తయారు చేశారు . అవన్నీ తను చూస్తూ ఉంటే పృథ్వీరాజ్ కపూర్ నుంచి అమితాబచ్చన్ వరకు ఫోటోలు కనిపించాయని అందరి గురించి వివరంగా రాసి ఉన్నారని చెప్పారు . అయితే ఎక్కడో ఒక మూల మాత్రం ఎంజీఆర్ జయలలిత ఉన్న ఒక్క ఫోటో మాత్రమే పెట్టారని అన్నారు. ఆనాటి మేటి నటులు ,ఎన్టీ రామారావు ,అక్కినేని నాగేశ్వరరావు ,రాజ్ కుమార్ ,విష్ణువర్ధన్ ,శివాజీ గణేషన్ , ఇలా ఎంతో మంది ప్రముఖులు గురించి అసలు ప్రస్తావన లేదని వాళ్ళ ఫోటోలు కూడా లేవని అన్నారు .

    అప్పట్లో భారతీయ సినిమా అంటే హిందీ చిత్ర రంగం అని అనుకునే పరిస్థితి ఉందని చెప్పారు . అయితే ఆనాడు తాను ఆ పరిస్థితికి ఎంతో అవమానానికి గురయ్యానని దక్షిణ భారత చిత్రాలను ప్రాంతీయ చిత్రాలుగా మాత్రమే చూసే పరిస్థితికి బాధపడ్డానని చిరంజీవి అన్నారు . అయితే ఆనాటి తన అవమానాన్ని బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ , కెజిఎఫ్-2 సినిమాలు తీర్చేశాయి అని గర్వంగా చెప్పారు .

    ఈరోజు భారతీయ సినిమా అంటే తెలుగు సినిమా , కన్నడ , తమిళ సినిమా అన్న ఒక పేరును సుస్థిరం చేశారు అని చెప్పారు. అటువంటి నటులు , దర్శకులు , అటువంటి సాంకేతిక నిపుణులు, తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి రావడం ఎంతో గర్విస్తున్నాం అని అన్నారు. ఆనాటి అవమానానికి ఈనాడు తన వారసులైన నటులు బాహుబలి ప్రభాస్ కానీ ,రామ్ చరణ్ ,జూనియర్ ఎన్టీఆర్, యాష్ కానీ .. ఇలా వీళ్ళందరూ దక్షిణ భారత సినిమాను భారతీయ సినిమా తమిళం గాని ఏదైనా సరే ఇప్పుడు భారతీయ సినిమాగా పేరు తెచ్చారని ఆనందం వ్యక్తం చేశారు..

     

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.