స‌మాధానం చూసి..టీచ‌ర్ షాక్ తిన్నాడు.

  0
  165

  ఎమ్మెల్యే ఎన్నిక‌లు ఎలా జ‌రుగుతాయి ?
  ఇది ఓ ఏడో త‌ర‌గ‌తి పిల్లాడికి పరీక్ష‌లో ఎదురైన ప్ర‌శ్న‌. ఆ పిల్లాడు రాసిన స‌మాధానం చూసి.. క‌శ్చ‌న్ పేప‌ర్ దిద్దిన టీచ‌ర్ షాక్ తిన్నాడు. అయినా మార్కులు వేశాడు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఫ‌రూఖ్ న‌గ‌ర్ మండ‌లంలోని లింగారెడ్డిగూడ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

  ఇంత‌కీ ఆ ఏడో త‌ర‌గ‌తి విద్యార్ధి రాసిన స‌మాధానం ఏంటో తెలుసా ?

  ఎమ్మెల్యే కోసం పోటీ చేసేవాళ్ళు ఇంటింటికీ వ‌చ్చి న‌న్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోమ‌ని చెప్తారు. ప్ర‌చారం చేస్తారు. 18 సంవ‌త్స‌రాలు ఉన్న వారికి ఓటు హ‌క్కు ఉంటుంది. వాళ్ళ‌కి పైస‌లు ఇస్తారు. బిర్యానీలు, మందు బాటిల్స్ ఇస్తారు. ఆడోళ్ళ‌కు చీర‌లు ఇస్తారు. ఎల‌క్ష‌న్స్‌లో ప్ర‌జ‌లు ఎన్నుకుంటారు. ప్ర‌భుత్వం ఎవ‌రికి ఎక్కువ ఓట్లు వ‌చ్చయ‌ని లెక్క‌బెడుతుంది. ఎవ‌రికి ఎక్కువ ఓట్లు వ‌స్తే వాళ్ళే గెలిచిన‌ట్లు ప్ర‌క‌టిస్తారు అంటూ ఆన్స‌ర్ రాశాడు. ఆ జ‌వాబు చూసిన ఓ ఉపాధ్యాయుడు ఆశ్చ‌ర్య‌పోయాడు. త‌న‌క‌ళ్ళ ముందు జ‌రిగిన స‌త్యాన్ని రాసిన‌ట్టున్నాడ‌ని భావించాడు. ఆ ప్ర‌శ్న‌కు ఆ విద్యార్ధి రాసిన జ‌వాబు క‌రెక్టే అని… 4 మార్కులు వేశాడు ఆ టీచ‌ర్. ఆ పిల్లాడు రాసిన ఆన్స‌ర్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.