ఎన్ టి ఆర్ జిల్లా నందిగామలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ హల్ చల్ చేశాడు. అప్పట్లో ఎన్నికల్లో సర్వేలంటూ , టిడిపికి అనుకూలంగా సర్వే ఫలితాలు చెప్పడం , ఆ తరువాత బొక్క బోర్లాపడటం, రాజకీయంగా ఎటుపోవాలో అయోమయంలో పడి , రాజకీయాలు వదిలేస్తున్నానని చెప్పాడు. అప్పట్లో ఆయన వ్యాపార లావాదేవీలపై కొన్ని కేసులు కూడా ఉండేవి.. ఇప్పుడు మళ్ళీ రాజకీయాలపై ఆయనకు గాలిమళ్లినట్టుయింది.
కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న లగడపాటి , మైలవరం ఎం ఎల్ ఏ కృష్ణప్రసాద్ తో ,నందిగామ వైసీపీ నేతలతో భేటీ అయ్యారు. 2024 ఎన్నికలకు సిద్ధం అవుతున్న సంకేతాలు ఇస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి రాజకీయాలకు దూరంగా ఉన్న రాజగోపాల్ ఇప్పుడు మళ్ళీ విజయవాడ పార్లమెంట్ స్థానానికి మళ్ళీ పోటీ చేసే ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. లగడపాటి తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటించానున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు..