నడిరోడ్డులో త్రివిక్రమ్.. పోలీసులు ఎందుకు ఆపారంటే..?

  0
  312

  నడిరోడ్డులో త్రివిక్రమ్..

  పోలీసులు ఎందుకు ఆపారంటే..?

  సినీ దర్శకుడు త్రివిక్రమ్ కు జరిమానా విధించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఈ ఉదయం ఆయన హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కారులో వెళ్తుండగా.. ట్రాఫిక్ పోలీసులు ఆయన కారును నిలిపివేశారు. కారుకు అద్దాలకు ఉండే బ్లాక్ ఫిల్మ్ తొలగించి జరిమానా విధించారు జూబ్లీ హిల్స్ పోలీసులు. జరిమానా విధించే సమయంలో త్రివిక్రమ్ కారులోనే ఉన్నారు.

  ఇటీవల హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు దూకుడు పెంచారు. కారు అద్దాలకు ఉండే బ్లాక్ ఫిలిం తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్స్ చేస్తున్నారు. ఇటీవల మంచు మనోజ్ కారుకు ఉండే బ్లాక్ ఫిలిమ్స్ కూడా తొలగించారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ట్రాఫిక్ పోలీసులు ఇలా బ్లాక్ ఫిలిం తొలగిస్తున్నారు. బైకులపై, కార్లపై ఉండే పోలీస్, ప్రెస్ స్టిక్కర్లను కూడా తీయించేస్తున్నారు. దీనిపై వివాదం నడుస్తున్నా.. ట్రాఫిక్ పోలీసులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా తమపని తాము చేసుకుంటూ వెళ్లిపోతున్నారు.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.