చిరు ఫ్యాన్స్ కూడా ఇక జనసేన సైనికులేనట..

  0
  66

  ఒక్కటైన మెగా ఫాన్స్..
  పవన్ కళ్యాణ్ ను సీఎంగా చేయాలని నిర్ణయం..
  =================
  మెగా ఫాన్స్ ఒక్కటయ్యారు. అవును.. గత కొంతకాలంగా చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త దూరం దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ డిజాస్టర్ కావడం కూడా దీనికి నిదర్శనం. ఈ మూవీ విడుదల సమయంలో కూడా పవన్ ఫాన్స్ ఎక్కడా కనిపించలేదు.. కేవలం చిరంజీవి ఫాన్స్ మాత్రమే అక్కడక్కడా హడావుడి చేశారు.

  పవన్ ఫాన్స్ మాత్రం కనీసం ఆచార్య మూవీ గురించి ఎక్కడా మాట్లాడలేదు. తమకు సంబంధం లేనట్టే వ్యవహరించారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. చిరంజీవి గత కొంతకాలంగా ఏపీసీఎం జగన్ తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై పవన్ ఫాన్స్ చాలాకాలంగా చిరుపై గుర్రుగా ఉన్నారు. అందుకే ఆచార్య మూవీ కోసం ఎక్కడ ప్రచారం చేయలేదు.

  గతంలో చిరు సినిమాకైనా, పవన్ మూవీకైనా, రాంచరణ్ సినిమాకైనా.. మెగా ఫ్యామిలీ అభిమానులు మొత్తంగా అండగా నిలిచేవారు. సోషల్ మీడియాలో కూడా మెగా ఫ్యామిలీపై నెగిటివ్ కామెంట్స్ రాకుండా చూసుకునేవారు. అయితే ఇటీవల కొంతకాలంగా పవన్, చిరు ఫాన్స్ మధ్య గాప్ వచ్చింది.

  తాజాగా విజయవాడలోని ఓ హోటల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మెగా స్టార్ చిరంజీవి, రాంచరణ్ కు చెందిన అభిమాన సంఘాల నేతలు సమావేశమయ్యారు. విషయం బయటకి పొక్కకుండా చర్చలు జరిపారు. అందరూ కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అంతర్యుద్ధాలు, అంతర్గత కలహాలు లేకుండా కలిసిపోవాలని నిర్ణయించుకున్నారు.

  అందరూ కలిసి జనసేన పార్టీకి మద్దతుగా ఉండాలని తీర్మానించుకున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు కూడా సంచలన ప్రకటన చేశారు. జనసేన ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రమే సీఎం అభ్యర్థిగా ఉంటాడని చెప్పారు. ఈ నిర్ణయంపై మెగా ఫాన్స్ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు పవన్ ఫాన్స్ కి తోడుగా చిరు అభిమానులు కూడా జత కట్టడంతో, మెగా ఫ్యామిలీ అభిమానులు మొత్తం ఒక్కటయినట్టుగా తెలుస్తోంది.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..