తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు మీరా జాస్మిన్. సంప్రదాయ పాత్రలతో ఆకట్టుకున్న ఆమె, గతంలో బొద్దుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆమెను చూస్తే ఎవరూ గుర్తుపట్టలేనట్టుగా మారింది.
ఇదంతా ఎందుకంటే సినిమాల్లో రీఎంట్రీ కోసమే. చాలా కాలం తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు మీరా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే మలయాళంలో ‘మకల్’అనే చిత్రంలో నటిస్తుంది. ఇప్పుడు తెలుగులో కూడా సినిమాలు చేయాలని ప్రయత్నిస్తుందట. ఇప్పటికే బోయపాటి శ్రీను తెరకెక్కించబోయే చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం.
తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాలుగు పదుల వయసులో కూడా మీరా..గతంలో కంటే అందంగా కనిపిస్తోంది. రీఎంట్రీ కోసమే ఈ అమ్మడు వెయిట్ లాస్ అయిందట.
సన్నబడిన మీరా జాస్మిన్ ఫోటోలు చూసి నెటిజన్స్ షాకవుతున్నారు. మీరా ఏంటి.. ఇంత సన్నబడింది? సినిమాల్లో రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాం అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.