హంతకురాల్ని వదిలేసిన పోలీసులకు జేజేలు..

  0
  3722

  బాలింతపై అత్యాచారానికి ప్రయత్నించిన ఓ నీఛుడికి తగిన శాస్తి జరిగింది. వారం రోజుల క్రితమే బిడ్డను ప్రసవించి ఆ బిడ్డను పొత్తిళ్లలో వేసుకుని ఆ పక్కనే మరో రెండేళ్ల బిడ్డతో ఒంటరిగా ఉన్న మహిళపై ఓ కామాంధుడు అత్యాచారానికి ప్రయత్నించాడు. సహకరించకపోతే బిడ్డల్ని చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ మహిళ చేతికందిన రోకలిబండను తీసుకుని వాడిని కొట్టి చంపేసింది. తమిళనాడులోని మీంజూరులో పొలాల్లో కాపలా ఉండే ఓ పేదరాలి విషయంలో జరిగిన ఘోరం ఇది. తీవ్రంగా గాయపడిన ఆ కామాంధుడు బయటకొచ్చి కొంచెం దూరం వెళ్లి అక్కడ పడిపోయి చనిపోయాడు.

  ఆ మహిళకు రక్తపు మరకలయ్యాయి. పోలీసు విచారణలో నిజం బయటపడింది. దీంతో పోలీసులు ఆమెను స్టేషన్ కు తీసుకెళ్లి ఆత్మరక్షణ కింద శీలం కాపాడుకోడానికి అతడిని చంపేసినట్టు కేసు నమోదు చేసి వదిలిపెట్టారు. ఐపీసీ సెక్షన్ 100 ప్రకారం ఆత్మ రక్షణకోసం ఎదుటి వ్యక్తిని చంపినట్టు రుజువైతే స్టేషన్ బెయిలు ఇచ్చి వదిలేసే అవకాశం ఉంది. ఈ కేసు విషయంలో కూడా పోలీసులు ఇదే పని చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులు పోలీసుల్ని అభినందించారు. విచారణ పేరుతో పచ్చి బాలింతను ఇబ్బంది పెట్టకుండా ఆమె ఎందుకు అతడ్ని కొట్టి చంపిందో అర్థం చేసుకుని వ్యవహరించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంఘటన జరగడానికి రెండు రోజుల ముందునుంచి ఆ కామాంధుడు ఆ పూరిపాక చుట్టుపక్కలే తిరుగుతున్నాడని కూడా గ్రహించారు. గతంలో కూడా తనకు లొంగిపొమ్మని ఆ యువకుడు బెదిరించాడని మహిళ చెప్పింది.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?