మారుతీ కార్ల ధరలకు రెక్కలు రానున్నాయి. సెప్టెంబర్ నెలనుంచి మారుతీకి సంబందించిన అన్ని మోడల్స్ ధరలు పెంచడం ఖాయమని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కారు విడి భాగాలు , ముడి ఉత్పత్తుల ధరలు పెరగడంతో , తప్పనిసరి పరిస్థితుల్లో కార్ల ధరలు పెంచుతున్నట్టు కంపెనీ ప్రకటించింది.
2021లో ఇప్పటికే మారుతి తన కార్ల ధరలను రెండు దఫాలుగా , ఇదేకారణం చూపి పెంచింది. ఇతర కార్ల కంపెనీలుకూడా ధరలు పెంచాయి.. ఈ దఫా మారుతి తన కంపెనీ మోడల్స్ అన్నింటిపై ధర పెంచనుంది.. ఆల్టో నుంచి విటారా బ్రేజా వరకు , అన్నిమోడల్స్ పై దరల పెంపు ఉంటుంది.
గత జనవరిలో మారుతి కొన్ని మోడల్స్ పై 34 వేల రూపాయలవరకు పెంచింది. ఏప్రిల్లో కొన్ని కారు మోడల్స్ పై 1.6 శాతం ధర పెంచింది. మార్కెట్ వర్గాల అంచనాలప్రకారం 12 శాతం వరకు గరిష్టంగా ధరలు పెంపు ఉండొచ్చునని చెబుతున్నారు.
ఇవీ చదవండి..