పెళ్ళైన కూతురూ అర్హురాలే..

  0
  152

  పెళ్లయినంత మాత్రాన కూతురు బంధం తెగిపోతుందా ..? పెళ్ళైనా కొడుకు సంబంధం తెగిపోదా..? ఇదేమి న్యాయం అన్న అభిప్రాయాన్ని ఏపీ హైకోర్టు వ్యక్తంచేసింది. కొడుకులు లేని తండ్రి ఉద్యోగంలో ఉంటూ చనిపోతే , కారుణ్యనియామకం కింద , పెళ్ళైన కూతురూ అర్హురాలేనని తీర్పు చెప్పింది. పెళ్లికాని కూతురే కారుణ్య నియామకానికి అర్హురాలని , పెళ్ళైన కూతురు అర్హురాలు కాదన్న నిబంధన సరైంది కాదని అన్నారు. పెళ్ళైన కొడుకు , కారుణ్య నియామకానికి అర్హుడైనప్పుడు , పెళ్లికాని కూతురు ఎలా అర్హురాలు కాకుండా ఉంటుందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగి మరణించిన తర్వాత.. అతని కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇచ్చే కారుణ్య నియామక ఉద్యోగానికి వివాహిత అయిన కుమార్తె కూడా అర్హురాలేనంటూ కోర్టు స్పష్టం చేసింది. పెళ్లి అయ్యిందన్న కారణంతో దమయంతి అనే మహిళకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వలేమంటూ ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు రద్దు చేసింది. తండ్రి మరణించిన నేపథ్యంలో తోబుట్టువులు ఎవరూ లేని, భర్తకు శాశ్వత ఆదాయమంటూ ఏదీ లేని పరిస్థితుల్లో కారుణ్య నియామకం కోసం దమయంతి చేస్తున్న అభ్యర్థనను ‘బ్రెడ్‌ విన్నర్‌ స్కీం’ కింద 6 వారాల్లో పరిగణనలోకి తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను హైకోర్టు ఆదేశించింది.

  ఇవీ చదవండి:

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?