ట్రాఫిక్ డ్యూటీలో పసిబిడ్డతో తల్లి..

  0
  312

  ట్రాఫిక్ డ్యూటీలో ఓ పోలీస్ తల్లి.. భుజంపై నిద్రపోతున్న బిడ్డ. మరోవైపు ట్రాఫిక్ కంట్రోల్.. ఇలాంటి పోలీసుని చూస్తే నిజంగా సెల్యూట్ చెయ్యాలనిపిస్తుంది. ఓ బిడ్డకు తల్లిగా , డ్యూటీకి అంకితమైన ఉద్యోగిగా ఆమె కర్తవ్య నిర్వహణ నిజంగా గొప్పదే. అలాగే ఇలాంటి పసి బిడ్డలున్న తల్లులపట్ల ప్రత్యేక శ్రద్ధపెట్టలేని అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసించక తప్పదు. పంజాబ్‌లోని చండీగఢ్‌కు చెందిన ప్రియాంక గత కొద్ది రోజులుగా ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారినిగా విధులు నిర్వహిస్తోంది. అయితే తన చంటి బిడ్డను చూసుకోవడానికి ఎవరూ లేరేమో గానీ.. ఆమె తన భుజాలపై బిడ్డను ఎత్తుకొని రహదారిపై ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేస్తున్నారు . ఓ ప్రయాణికుడు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దేశ వ్యాప్తంగా ఈ వీడియో చర్చనీయాంశమైంది.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..