పెళ్లి రధం మంటల్లో .. పెళ్లి కొడుకు క్షేమం..

  0
  259

  పెళ్లి వేడుకల్లో హంగామాలు ఒక్కోసారి చావు అంచులకు పోతున్నాయి. డబ్బులు వెదజల్లి చేసే ఆడంబరాల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. గుజరాత్ లో , ఓ పెళ్లి సందర్భంగా పెళ్ళికొడుకు , రథంపై ఊరేగుతున్నాడు. బాజా భజంత్రీలతో , ఊరేగింపు సాగిపోతుండగా , ఒక టపాకాయ పెళ్లి రథంపై పడింది. వెంటనే రధం మంటల్లో చిక్కింది. దీంతో పెళ్ళికొడుకు రధం లోనుంచి దూకేసాడు. స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. పంచమహాల్లో జరిగిన ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. టపాకాయలు కాల్చడం , కోవిద్ నిబంధనలు ఉల్లంఘించి ఊరేగింపు చేయడం నేరమని కేసుపెట్టి , పెళ్లి అయిపోయిన వెంటనే స్టేషన్ కి రమ్మని , పెళ్లికొడుక్కి సమన్లు ఇచ్చారు..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.