ఆ టైంకే ప్రియుడు ఎంటర్ అయిపోయాడు.

  0
  202

  ప్రియురాలికి పెళ్లి జరుగుతుండగా చివరి నిమిషంలో ప్రియుడు రావడం , పెళ్లికూతురు మెడలో బలవంతంగా తాళి కట్టడం , తరువాత తీసుకెళ్లడం ఇవన్నీ గతంలో సినిమాల్లో చూస్తే నోరు తెరిచే వాళ్ళం. ఇది సాధ్యమా అని అనుకునే వాళ్ళం . అయితే ఇప్పుడు ఇవి చాలా కామన్ అయిపోయాయి పెళ్లి కూతురు తాను ప్రియుడు కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడం , పెళ్లి పీటలపైనుంచే లేచి వెళ్లిపోవడం , పెళ్ళికిముందు , పెళ్లి వద్దని చెప్పడం , ఇలాంటివి కామన్ అయిపోయాయి .

  ఇప్పుడు బీహార్ లో కూడా అలాంటి సంఘటనే జరిగింది. పాట్నాలో ఒక పెళ్ళిలో పెళ్ళికొడుకు ,పెళ్ళికూతురు దండలు మార్చుకుని ,ఇక నుదుట సింధూరం , పెట్టె కార్యక్రమం ప్రారంభం కాబోతుంది . ఆ టైంకే ప్రియుడు ఎంటర్ అయిపోయాడు. పెళ్లి కొడుకు చేతిలో పూల మాల లాగేసుకుని , పెళ్లి కూతురి మెడలో వేశాడు . పురోహితుణ్ణి కొట్టి అతడి చేతిలో నుంచి సింధూరం లాక్కొని , ఆమె నుదుట దిద్దేశాడు.. ఆ తర్వాత తాళి కూడా కట్టేసాడు .

  క్షణాల్లో జరిగిపోయిన ఈ సంఘటననుంచి తేరుకున్న బంధువులు ప్రియుడు అమిత్ కుమార్ పై దాడి చేశారు. అయితే పెళ్లికూతురు అడ్డుపడి , అతడిని కొట్టొద్దని , తానే ఇలాచెయ్యమన్నానని చెప్పింది. పెళ్ళికొడుకు అక్షయ్ కుమార్ మాత్రం పెళ్లికూతురు ఇదివరకే మరొక వ్యక్తితో సంబంధం ఉండటంతో ఆమెను పెళ్లి చేసుకోలేదని పెళ్లి అని చెప్పాడు . ఆమె కూడా తాను ప్రియుడితోనే ఉంటానని చెప్పేసింది. ఆ తర్వాత పోలీస్ పంచాయితీలో , పెళ్లికొడుక్కి , ఖర్చులు ఇప్పించేసారు.. పెళ్లి కూతురు ప్రియుడితో సంతోషంగా వెళ్ళిపోయింది..

   

  ఇవి కూడా చదవండి..

  ఆమె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..