వాట్సప్ ఆపిన పెళ్లి.. ఎలాగో తెలుసా..?

  0
  274

  మరికొన్ని గంటల్లో పెళ్లి జరగబోతోంది, ఇంతలో అక్కడికి పోలీసులొచ్చారు. అమ్మాయికి పెళ్లి ఇష్టముందా లేదా అని అడిగారు. పెళ్లి కొడుకు ఎక్కడని గద్దించారు. ఆ సీన్ చూసి పెళ్లి కొడుకు భయంతో వణికిపోయాడు. తనకీ పెళ్లి ఇష్టం లేదని, బలవంతంగా వివాహం చేయిస్తున్నారంటూ పెళ్లి కూతురు తేల్చి చెప్పింది. దీంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. అయితే ఇలా పెళ్లి ఆగిపోడానికి కారణం ఓ చిన్న వాట్సప్ మెసేజ్.
  చెన్నై నగరంలో జనతుల్లా ఫిర్దోస్ అనే అమ్మాయికి తల్లిదండ్రులు పెళ్లి ఫిక్స్ చేశారు. మేనమామతోనే పెళ్లి కుదిరింది. అంగరంగవైభవంగా ఏర్పాట్లు జరిగాయి. అయితే అప్పటికే మేనమామకు ఇతర మహిళలతో సంబంధాలున్నాయని పెళ్లి కూతురికి తెలిసింది. పెళ్లి క్యాన్సిల్ చేయాలనుకుంది. పెద్దవారు మాత్రం ఇంట్లో బంధించి పెళ్లి చేయాలనుకున్నారు. ఇంతలో పెళ్లి కూతురు వాట్సప్ లో తన కష్టాలు చెబుతూ ఫ్రెండ్స్ కి ఓ వీడియో షేర్ చేసింది. అది పోలీసుల వరకు వెళ్లడంతో నిముషాల వ్యవధిలో పోలీసులు వచ్చి పెళ్లి ఆపించేశారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?