ప్రియురాలికోసం ప్రియుడు ఏం చేశాడంటే..?

  0
  274

  ఆమెకు పెళ్లైంది, పిల్లలు కూడా ఉన్నారు. కానీ భర్తను వదిలేసి ఒంటరిగా ఉంది. అతడికి కూడా పెళ్లయింది, భార్య, పిల్లలున్నారు. కానీ వారిని కాదని భర్తలేని ఒంటరి మహిళకు దగ్గరయ్యాడు. ఇద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేని స్థితికి వచ్చారు. చివరకు ఇంట్లో వ్యవహారం తెలిసింది. భార్యను వదిలేసి ప్రేయసితో ఉండటానికి ప్రియుడు నిశ్చయించుకున్నాడు. కానీ కథ అడ్డం తిరిగింది.

  హైదరాబాద్ లోని నాగోల్ వాసి 35 ఏళ్ల సురేష్, హిమాయత్ నగర్ లో జిరాక్స్ సెంటర్ లో పని చేస్తున్నాడు. అక్కడే మరో సంస్థలో పని చేస్తున్న ఒంటరి మహిళతో అతడికి జోడీ కుదిరింది. ఇద్దరూ వివాహితులే అయినా భర్త లేకపోవడంతో ఆ మహిళతో ప్రేమాయణం కొనసాగించాడు సురేష్. అయితే ఈ వ్యవహారం ఇంట్లో తెలిసే సరికి సురేష్ భార్య ఆగ్రహంతో ఊగిపోయింది. భర్తను ఏమీ అనలేదు కానీ, అతడి ప్రియురాలి ఇంటికెళ్లి రచ్చ చేసింది. దీంతో భయపడిపోయిన ఆమె.. సురేష్ ని దూరంగా పెట్టింది. సురేష్ కి ఏంచేయాలో తోచలేదు. కట్టుకున్న భార్య, బిడ్డలు కూడా గుర్తు రాలేదు. ప్రియురాలి మోజులో పడి తన ప్రాణం తీసుకోవాలనుకున్నాడు. ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?