కుంకుమ బాగాలేదనే సాకుతో పెళ్లి రద్దు

  0
  248

  కుంకుమ బాగాలేదనే సాకుతో పెళ్లి రద్దు చేశారు పెళ్లి కొడుకు తల్లితండ్రులు. ఇలాంటి మూర్ఖులకు ఎంతచెప్పినా దండగే. ముంబైకి చెందిన నీరజ్ పటేల్ ఇంజనీర్ . అతడికి మెడిసిన్ చదివిన అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్ళికి ముందు తిలక్ ఫంక్షన్ చేస్తారు. ఈ వేడుకలో కుంకుమ సరిగా లేదని , తమను సరిగా గౌరవించలేదని నీరజ్ తల్లి ఆరోపించింది. పెళ్ళికొడుకు తల్లి అయినా తనకు మర్యాద ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేసి , పెళ్లి రద్దు చేస్తున్నట్టు చెప్పి , తిరిగి వెళ్లిపోయారు.

  పెళ్ళికొడుకు కూడా అమ్మకే వత్తాసు పలికాడు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు . దీంతో అమ్మాయి తల్లితండ్రులు కేసుపెట్టారు. పోలీస్ విచారణలో తిలక్ వేడుకకు తెచ్చిన కుంకుమ నాణ్యత సరిగాలేదని అందువల్లనే పెళ్ళి రద్దు చేసుకున్నట్టు చెప్పారు.. ఇలాంటి మూర్ఖులున్న ఇంట్లో అమ్మాయిని ఇవ్వకపోవడమే మంచిదని బంధువులు , పోలీసులు చెప్పారు. మోసం , నమ్మకద్రోహం కింద కేసు నమోదు చేశారు.

  ఇవీ చదవండి:

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?