ఫొటోలో లాగా లేడు- నాకొద్దు.పెళ్లి క్యాన్సిల్.

  0
  338

  పీటలమీదకు వచ్చిన పెళ్లి కొడుకుకి, ఫొటోలో తను చూసిన పెళ్లి కొడుక్కి తేడా ఉండటంతో పెళ్లి కూతురు అతడ్ని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో విధిలేక పెళ్లి కొడుకు వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు. పెళ్లి చూపులకు బ్యూటీ పార్లర్ కి వెళ్లి మేకప్ వేసుకుని ఫొటో పంపించాడు. ఇద్దరు పరస్పరం చూసుకోకుండానే ఫొటోలతోనే పెళ్లి చూపులు జరిగాయి. ఫొటోలో ఉన్న అబ్బాయి ఫర్వాలేదనుకుని అమ్మాయి ఓకే చెప్పింది. అయితే నేరుగా పెళ్లి కొడుకుని చూసిన తర్వాత, ఫొటోలో ఉన్నంత అందంగా లేడంటూ పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో బెట్టయ అనే గ్రామంలో ఈ విచిత్రం జరిగింది. పెళ్లి కూతురు అభ్యంతరంతో పాపం పెళ్లి కొడుకు, అతడి తరుపు బంధువులు మౌనంగానే వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఫొటోలో ఒకరు, పెళ్లికి మరొకరు వచ్చారన్న అనుమానం పెళ్లి కూతురికి కలిగింది. పెళ్లి కొడుకు పేరు అనిల్ కుమార్ చౌదరి. అమ్మాయి నిరాకరించినా పెళ్లి కొడుకు, అతని తరుపు బంధువులు.. ఎలాంటి గొడవ చేయకుండా అక్కడినుంచి మౌనంగా వెళ్లిపోవడం విచిత్రం.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..