రావత్ స్థానంలో వచ్చేది ఈయనే..

  0
  1509

  బిపిన్ రావత్ కి ముందు త్రిదళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) అనే పోస్ట్ అసలు లేదు. త్రివిధ దళాధిపతిగా రాష్ట్రపతి ఉండేవారు. అయితే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలను సమన్వయం చేసుకునేందుకు త్రిదళాధిపతి అనే పోస్ట్ ని సృష్టించి దానికి బిపిన్ రావత్ ని అధిపతిగా చేశారు. అప్పటికే ఆర్మీ చీఫ్ గా రిటైర్ అయిన బిపిన్ రావత్ భారత తొలి త్రిదళాధిపతి అయ్యారు. ఆయన అకాల మరణంతో ఆ పోస్ట్ లో ఎవరిని తీసుకుంటారనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఆర్మీ అధిపతి జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్మీ, నేవీ, వాయుసేన అధిపతుల్లో ఒకరిని సీనియార్టీ ప్రకారం ఈ పదవికి ఎంపిక చేస్తారు. నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ లకంటే ఆర్మీ చీఫ్ సరవణె సీనియర్ కావడంతో ఆయన ఈ పోస్ట్ కి అర్హుడని అంటున్నారు. ఆర్మీ చీఫ్‌ గా ఉన్న సరవణె.. బిపిన్ రావత్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఒకవేళ సరవణె సీడీఎస్‌ అయితే ఆర్మీ అధిపతిగా నార్తర్న్ ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ యోగేష్‌ కుమార్‌ జోషీ, లేదా ఆర్మీ ఉప అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ చండీ ప్రసాద్‌ మహంతి ఆర్మీ చీఫ్ అయ్యే అవకాశాలున్నాయి.

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.