చనిపోయిన ఐదో ఏడాది కుక్కకు కాంస్య విగ్రహం..

  0
  166

  ఇంట్లో మ‌నిషి చ‌నిపోతేనే ప‌ట్టించుకునే రోజులు కాదివి. క‌ర్మ‌కాండ‌ల ఖ‌ర్చు దండ‌గంటూ వెళ్ళిపోతున్న మ‌నుషులూ ఉన్నారు. అలాంటిది త‌ను ప్రేమ‌గా పెంచుకున్న కుక్క చ‌నిపోతే.. ఏకంగా దానికి విగ్ర‌హ‌మే క‌ట్టించేశాడు ఓ య‌జ‌మాని. కృష్ణాజిల్లాలో  బాపులపాడు మండలం అంపాపురంకు చెందిన
  జ్ఞాన‌ప్ర‌కాష్ అనే వ్య‌క్తి ఓ కుక్క‌ను ఎంతో ప్రేమ‌గా పెంచుకున్నాడు. ఆ కుక్క కూడా ఎంతో విశ్వాసంగా మెలిగింది. బిడ్డ‌లాగా సాకాడు. దాని ఆల‌నాపాల‌నా చూసుకున్నాడు అయితే ఐదేళ్ళ క్రితం ఆ కుక్క చ‌నిపోయింది. ఇంట్లో మ‌నిషి దూర‌మైనంత బాధ‌తో దాని అంత్య‌క్రియ‌లు కూడా జ‌రిపించాడు. తొలి సంవ‌త్స‌రీకాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. బంధుమిత్ర స‌ప‌రివార స‌మేతంగా అంద‌రినీ పిలిచి భోజ‌నాలు పెట్టించాడు. ప్ర‌తిఏడాది చేస్తూ ఇలా ఐదేళ్ళు గ‌డిచిపోయాయి. ఇప్పుడు ఏకంగా ఆ కుక్క కోసం విగ్ర‌హం క‌ట్టించేశాడు. మామూలు విగ్ర‌హం కాదండోయ్… కాంస్య విగ్ర‌హం. కుక్క ఎంత పొడ‌వు, ఎంత ఉంటుందో… అదేస్థాయిలో విగ్ర‌హం ఏర్పాటు చేయ‌డం విశేషం. ఈ కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణ కోసం శాస్త్రోక్తంగా పెద్ద క్ర‌తువును జ‌రిపించాడు. అంద‌రికీ భోజ‌నాలు పెట్టించాడు. ఎంతో విశ్వాసం చూపించిన కుక్క‌పై త‌న‌కున్న ప్రేమ‌ను ఇలా చాటుకున్నాడు జ్ఞాప‌ప్ర‌కాష్‌.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?