మంచు మనోజ్ వే ..అయితే మాకేంటి..??

  0
  1505

  మంచు మనోజ్ వే ..అయితే మాకేంటి..??
  హైదరాబాద్ లో కార్లకున్న బ్లాక్ ఫిలిం పై దాడులు ముమ్మరం చేసారు. తాజాగా హీరో మనోజ్ కారుని ఆపి , కారు అద్దాలకున్న బ్లాక్ ఫిలిం తొలగించారు. ఇదివరకే జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ , అల్లుఅర్జున్ లాంటి సినీ నటుల కార్లను ఆపి , అద్దాలకున్న బ్లాక్ ఫిలిం తొలగించి ఫైన్ వేశారు.

  ఇప్పుడు మంచు మనోజ్ కారు ఆపితే , నేను మనోజ్ అని పరిచయం చేసుకున్నాడు.. కారుపక్కన పెట్టించి , అద్దాలకున్న బ్లాక్ ఫిలిం తొలగించి , 700 రూపాయలు ఫైన్ వేశారు. ఇటీవల ఒక యూట్యూబర్ , ఆమె స్నేహితుడు , కొబ్బరి బోండాల్లో మద్యం పోసుకొని , హోలీ రోజున , కారులోనే తాగి , కారు నడిపిన ప్రమాదంలో , ఆ యువతి చనిపోయిన విషయం తెలిసిందే.

  ఈ కారు ఢీ కొట్టి మరో మహిళకూడా మరణించింది. వీళ్ళ కారు అద్దాలకు , బ్లాక్ ఫిలిం ఉండటంతో , ఇద్దరూ కారులోనే కూర్చొని మందు కొట్టి , ఆ యువతి మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసి , దారుణం చేసింది. ఈ సంఘటన తరువాత నుంచి , కార్లకు బ్లాక్ ఫిలిం తొలగింపులో పోలీసులు దాడులు ముమ్మరంచేశారు..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..