పంటికి చికిత్స కోసం స్పెషల్ ఫ్లయిట్లో ఢిల్లీకి కేసీఆర్..

  0
  429

  ఢిల్లీకి కేసీఆర్..

  దేనికో తెలిస్తే షాక్ అయిపోతారు..

  తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే అకస్మాత్తుగా సీఎం ఢిల్లీ టూర్ పై మీడియాలో విభిన్న కధనాలు వస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రధాని మోడీతో తాడో పేడో తేల్చుకునేందుకు సీఎం కేసీఆర్, ఢిల్లీకి వెళ్తున్నారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి కొన్ని మీడియా సంస్థల్లో మాత్రం ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థుల భవిష్యత్తు కోసం కేంద్రం పెద్దలతో మాట్లాడేందుకు వెళ్తున్నారని అంటున్నారు. ఈ విషయంపై ద్రుష్టి పెట్టాలని కేసీఆర్ ఇటీవల కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే..

  తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలా ఉన్నట్టుండి, ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారనే విషయంపై ఉదయం నుంచి టీవీల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ వర్గాలు మాత్రం ఢిల్లీ టూర్ కేవలం కేసీఆర్ పర్సనల్ ట్రిప్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. కేసీఆర్ గత కొంతకాలంగా పంటినొప్పితో బాధపడుతున్నారు.

  ఈ పంటినొప్పి చికిత్స కోసమే ఆయన ఢిల్లీకి వెళ్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేక విమానాన్ని కూడా అధికారులు సిద్ధం చేశారు. ఢిల్లీలో కేసీఆర్ మరొక మూడు రోజులు గడపనున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని ఆరోగ్య పరీక్షలు కూడా కేసీఆర్ ఢిల్లీలోనే చేయించుకుంటారని ప్రగతి భవన్ వర్గాల సమాచారం. అక్కడి నుంచి కుటుంబ సమేతంగా శ్రీరంగం కూడా వెళ్తారని చెబుతున్నారు.

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..