కూతురు రంగుల కల వెనుక ఓ తండ్రి కన్నీటి వ్యథ

  0
  10384

  హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ముగ్గురిలో ఇద్దరు సీరియల్ ఆర్టిస్ట్ లలో ఓ అమ్మాయి కుటుంబం దీనావస్థ కన్నీరు పెట్టిస్తోంది. ఇప్పుడు మానస అనే నటి అంత్య క్రియలకు తండ్రి వద్ద డబ్బులు కూడా లేవు. నిజానికి ఈ మానస కుటుంబం దరిద్రంలో ఉంది. మహబూబ్ నగర్ బాదేపల్లికి చెందిన మానస తల్లి ఆరేళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఇప్పుడు కూతురు కూడా అలాంటి ప్రమాదంలోనే చనిపోయింది. మానస తండ్రి రవీందర్ ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. అక్క కొరియర్ సర్వీస్ లో పనిచేస్తోంది. పదో తరగతి వరకు చదివిన మానస టీవీలో నటించడంపై మోజుతో హైదరాబాద్ కి చేరుకుంది. షార్ట్ ఫిల్మ్స్ లో నటించేది. షూటింగ్ లేనప్పుడు ఇంటికి వచ్చేది.

  ఇటీవలే ఇంటికి వచ్చి రేకుల కప్పు ఉన్న ఇల్లు బాగాలేకపోవడంతో కొత్త రేకులు వేయించి, పెయింటింగ్ వేయించి వారం రోజులు ఇంట్లో ఉండి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ కి వెళ్లింది. అదే రోజు రాత్రి స్నేహితుల ఇంట్లో ఒక పార్టీలో పాల్గొంది. కారులో వస్తూ ప్రమాదానికి గురికావడంతో కారు డ్రైవింగ్ చేస్తున్న అబ్దుల్ తో సహా మరో నటితో కలసి ఆమె చనిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన కూతురు అంత్య క్రియలు చేసేందుకు కూడా తన వద్ద డబ్బులు లేవని, ఎవరైనా సహకరించాలని తండ్రి కోరుతున్నాడు. టీవీ, సినిమా రంగుల కలల ప్రపంచం వెనక ఎంతటి దరిద్రం ఉంటుందో మానస అంత్య క్రియలకు చేతిలో చిల్లి గవ్వలేని ఆ తండ్రి కథే ఉదాహరణ.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.