క్యాన్సర్ తో బాధపడుతున్న హంసా నందిని..

  0
  5050

  టాలీవుడ్ హీరోయిన్, ఐటమ్ గర్ల్ హంసా నందిని క్యాన్సర్ తో పోరాడుతోంది. తాను బ్రెస్ట్‌ క్యాన్సర్‌ డ్‌-3తో బాధపడుతున్నట్లు ఆమె ప్రకటించింది. ఇన్‌ స్టాగ్రామ్‌ లో గుండుతో ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ ‘నాకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌. ప్రస్తుతం కీమో థెరపీ చికిత్స తీసుకుంటున్నాను అని చెప్పింది. త్వరలో క్యాన్సర్‌ ను జయించి పూర్తి ఆరోగ్యంతో తిరిగి సినిమాల్లో నటిస్తానని చెప్పింది హంసా నందిని.

  18 సంవత్సరాల క్రితం క్యాన్సర్‌ తో హంసా నందిని తల్లి కన్నుమూశారు. అప్పటి నుంచి హంసానందిని కూడా అదే భయంతో జీవిస్తున్నానని చెప్పుకొచ్చారు. నాలుగు నెలల క్రితం రొమ్ములో కణతి ఉన్నట్లు గుర్తించిన ఆమె వైద్యుల్ని సంప్రదించారు. పరీక్షల అనంతరం రొమ్ము క్యాన్సర్‌ అని మూడో దశలో ఉందని వైద్యులు చెప్పారు. సర్జరీ చేసి ఆ కణతిని తొలగించారు. క్యాన్సర్‌ని ముందుగానే గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అంటున్నారు హంసా నందిని. 9 విడతలుగా కీమోథెరపీలు చేయించుకున్నానని చెప్పారు హంసా నందిని. మరో ఏడుసార్లు కీమో చేయించుకోవాల్సి ఉందన్నారు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.