ఇలాంటి మూగజీవాల ప్రేమ ఏ జన్మ బంధమో ..?

    0
    294

    ప్రేమాను బంధాలు, ఆత్మీయత అనురాగాలు, మనుషుల్లోనే కాదు, పశువుల్లో కూడా ఎక్కువే. తనతో ఉన్న ఆవును కబేళాకు అమ్మేయడంతో ఆ ఎద్దు, ఆ ఆవును తీసుకుపోతున్న వాహనం వెంట పరుగులు తీసింది. ఆ వాహనం ఆగినప్పుడల్లా వాహనం చుట్టూ తిరిగి ఆవు వైపు చూసేది. కన్నీరు పెట్టేది. వ్యాన్ డ్రైవర్ వద్దకు వెళ్లి, ప్రాధేయపడుతున్నట్టు చూసేది. ఎక్కడ వ్యాన్ ఆపినా, ఆ వెంటనే వ్యాన్ చుట్టూ తిరిగి ఆవు వైపు చూసుకుని, మళ్లీ డ్రైవర్ ని ప్రాథేయపడుతున్నట్టు అరిచేది. ఇలాగే చేస్తుండటంతో ఓ దశలో డ్రైవర్ కి కూడా బాధ వేసి, ఆలోచనలో పడ్డారు.

    ఈ విషయం సోషల్ మీడియాలో వచ్చిన నిముషాల్లోనే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వెంటనే తన అనుచరులకు చెప్పి డబ్బులిచ్చి ఆవుని కొనుగోలు చేసి రెండింటినీ దేవాలయానికి దానం చేశారు. దేవాలయంలో వాటికి పూజలు చేసి వివాహం చేసి, ఉంచేశారు. అత్యంత హృదయ విదారకమైన ఈ సంఘటనకు శుభం కార్డుతో ముగింపు పలికారు. తమిళనాడులోని తేని జిల్లాలో ఈ ఘటన జరిగింది.

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్