బిర్యానీ తిని , వజ్రాల హారం మింగేశాడు..

  0
  263

  దొంగతనాల్లో వీడో వెరైటీ . ఇఫ్తార్ పార్టీ కి వెళ్లి బిర్యానీ తో పాటు ఆ ఇంట్లో ఉన్నవజ్రాల హారాన్ని కూడా మింగేశాడు . వీడి తెలివికి పోలీసులే జోహార్ అంటున్నారు. ఆ తర్వాత పోలీసు విచారణలో వజ్రాలు నగల ఘరానా దొంగ ఎవరో గుర్తు పట్టేశారు. వాడికి డాక్టర్లు ఆపరేషన్ చేసి పొట్టలోనుంచి నగలు తీసి పోలీసులకు అప్పజెప్పారు. ఇది ఎక్కడో విదేశాల్లో జరిగిన దొంగతనం కూడా కాదు , చెన్నైలోనే జరిగింది . ఇఫ్తార్ పార్టీకి నగల షాప్ యజమాని స్నేహితులు , బంధువులను తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు .

  ఒక స్నేహితుడు ఇంట్లో బిర్యాని తినేసి , అటు ఇటు తిరిగి నట్టు నటించి ఒకటిన్నర లక్షల విలువైన వజ్రాల హారం బీరువాలో ఉంటే మింగేశాడు. ఇఫ్తార్ జరుగుతుండగానే నగ పోయిందని గుర్తించారు. తర్వాత అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు . పోలీసులు జరిపిన సీసీ కెమెరాలు పరిశీలనలో దొంగతనం బయటపడింది . దీంతో పోలీసులు గట్టిగావిచారిస్తే బిరియాని తిన్న తర్వాత , నగ చూసి మింగేసానని చెప్పాడు,. అతడిని పోలీసులు హాస్పిటల్ లో చేర్పించి ఆపరేషన్ చేయించి , నగను బయటకు తీశారు.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.