ఈ- బైక్ కొన్న వారానికే దాన్ని ఓనర్ తగలబెట్టేసాడు..

    0
    158

    దేశంలో ఎలక్ట్రిక్ బైకులు చాలావరకు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ పేలిపోయి తగలబడుతుంటే , తమిళనాడులోని తిరుపత్తూర్ లో మాత్రం ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ బైక్ తో విసిగిపోయి, కొన్న వారానికే తగులబెట్టేశాడు. వినేందుకు విచిత్రంగానే ఉంది కానీ ఆ వ్యక్తి ఎలక్ట్రిక్ బైక్ తో వేగలేక కొన్న కొద్దికాలానికే విసిగిపోయి తగలబెట్టడం మరీ విచిత్రం. పృథ్వీరాజ్ అనే వ్యక్తి తిరుపత్తూరుకి చెందినవాడు . ఈ బైక్ మీద మోజుతో లక్షకు పైగా ఖర్చుచేసి కొన్నాడు . అప్పటి నుంచి బైక్ ట్రబుల్స్ ఇస్తోంది .

    నిన్నటి రోజున గుడియాత్తం ఆర్టీవో ఆఫీసుకు బైక్ ను రిజిస్టర్ చేసేందుకు వెళ్ళాడు. అయితే పృద్విరాజ్ ఉండే తిరుపత్తూరు తమ పరిధిలోకి రాదనీ ఆర్టీఓ చెప్పిపంపేసాడు. తమ దగ్గర రిజిస్టర్ చేసుకునేందుకు నిబంధనలు అనుమతించమని చెప్పాడు. దీంతో పృద్వీరాజ్ తిరుపత్తూరుకు  ఈ బైక్ పై పోతున్నాడు. అయితే మధ్యలో ఈ బైక్ ఆగిపోయింది . అప్పటికీ నాలుగో దఫా ట్రబుల్ ఇచ్చింది . కొత్త బైక్ ఇన్నిసార్లు ట్రబుల్ ఇవ్వడంతో పాపం పృధ్వీరాజ్ విసిగిపోయాడు . దీంతో బైక్ రోడ్డు పక్కకు తీసుకెళ్ళి పెట్రోల్ తెచ్చి , దానిపై పోసి తగలబెట్టేశారు.ఇదీ , నేటి పరిస్థితి…

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.