అబ్బాయికి 66,అమ్మాయికి 38..బుల్ బుల్ పెళ్లి..

  0
  299

  ప్రముఖ మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ 66 ఏళ్ళ వయసులో లో 26 ఏళ్ల యువకుడిలా ఫీల్ అయిపోతున్నాడు .. 38 ఏళ్ల తన ప్రియురాలు టీచర్ గా పని చేసే బుల్ బుల్ సాహా అనే యువతిని మే నెల రెండో తేదీ పెళ్లి చేసుకోబోతున్నాడు . ఇందుకోసం కలకత్తాలోని తన ఇంట్లో హల్దీ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. తన ప్రియురాలితో పెళ్లి కోసం అరుణ్ లాల్ , మొదటి భార్య రీనాతో విడాకులు తీసుకున్నా, తన మొదటి భార్య అనుమతి కూడా తీసుకున్నారు.

   

  మొదటి భార్యకు విడాకులు ఇచ్చినప్పటికీ ఆమె ఆరోగ్యం దృష్ట్యా , ఆమెను తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఆమె మంచానికే పరిమితం కావడంతో ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది. అరుణ్ లాల్ కు బుల్ బుల్ సాహో తో చాలా కాలంగా పరిచయం ఉంది . పెళ్లయిన తర్వాత విడాకులు తీసుకున్నప్పటికీ తనతోనే ఉంటున్న తన మొదటి భార్య అనారోగ్యంతో మంచం మీద వుండడం తో ఆమె బాగోగులు కూడా తన రెండో భార్య చూసుకుంటుందని చెబుతున్నాడు . గతంలో దవడ క్యాన్సర్ రావడం తో క్రికెట్ కామెంట్రీ కూడా కొంతకాలం దూరంగా ఉన్నాడు . ప్రస్తుతం బెంగాల్ టీంకు కోచ్ గా పని చేస్తున్నాడు . క్రికెట్ లో చాలా ప్రముఖమైన వ్యక్తి అరుణ్ లాల్ .

  భారతదేశం తరఫున 16 టెస్టుల్లోనూ , 13 ఒడిఐ లోనూ పాల్గొన్నాడు . 1982 నుంచి 89 వరకు 7 ఇంటర్నేషనల్ ఫిఫ్టీన్ లో పాల్గొన్నాడు . క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కామెంటేటర్ గా వుండిపోయాడు . ఆ తర్వాత దవడ క్యాన్సర్ రావడంతో ఆ బాధ్యతల నుంచి కూడా కొంత కాలం పాటు వైదొలిగాడు. ప్రస్తుతం బెంగాల్ కోచ్ గా ఉన్నాడు. తన ప్రియురాలు సాహో తో చేసుకున్న హల్దీ వేడుకలో పోటోలను సోషల్ మీడియాలో హ్యాపీగా షేర్ చేశాడు మీరు చూసేయండి..

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.