చెన్నైలో ఈ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ చాలా స్పెషల్..

  0
  1007

  ఐపీఎస్ ఆఫీసర్ ల లో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క స్టైలు , లేడీ ఐపీఎస్ ఆఫీసర్ లు , అయితే ఇంకా ప్రత్యేకత.. వారు ఏం చేసినా విలక్షణంగా , విచిత్రంగానే ఉంటుంది.. చెన్నైలో ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసర్ రాత్రిపూట గస్తీ నిర్వహించే తీరు వినూత్నంగా ఉంటుంది . పోలీస్ పెట్రోలింగ్ కారులోనో , పోలీసు సెక్యూరిటీతోనో కాకుండా సైకిల్ పైనే ఆమె తన పరిధిలోని ప్రాంతాల్లో రమ్య భారతి అనే ఈ ఐపీఎస్ ఆఫీసర్ పరిశీలిస్తుంది . 2008 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన రమ్య భారతి విధి నిర్వహణ విషయంలో ప్రత్యేకం..

  గ్రేటర్ చెన్నై నార్త్ జోన్ అడిషనల్ కమిషనర్ గా ఆమె పని చేస్తున్నారు. రెగ్యులర్ గా ఆమె సైకిల్ మీదనే రాత్రి సమయాల్లో తన సిబ్బంది పనితీరును పరిశీలిస్తారు. పెట్రోలింగ్ పోలీసులు ఎవరు ఎక్కడ ఉన్నారు అన్న విషయాలను పరిశీలిస్తూ ఉంటుంది .. గత రాత్రి చెన్నైలోని ఫ్లవర్ బజార్ నుంచి ఆమె సైకిల్ మీద వెళ్తుంటే కెమెరా కళ్ళకు చిక్కింది. అనుమానం ఉన్న వారిని రోడ్లపైనే ఆపి ప్రశ్నిస్తుంది . ఒక నెటిజెన్ ఆమె సైకిల్ పై గస్తీని ట్విట్టర్ లో పెట్టాడు.

  ఈ విషయం ముఖ్యమంత్రి స్టాలిన్ వరకు వెళ్ళింది.. వెంటనే ఆమెను అభినందిస్తూ ఒక సందేశం పంపించారు . ఆయన ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు . బహుశా దేశంలోని మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ల లో సైకిల్ మీద గస్తీ నిర్వహించే ఐపీఎస్ ఆఫీసర్ లలో , రమ్య భారతి మొదటివారు కావచ్చు .. వివిధ రకాలుగా వివిధ కోణాలలో లేడీ ఐపీఎస్ ఆఫీసర్ లు తమ విధులు నిర్వహిస్తున్న వారిలో రమ్య భారతి మాత్రం చాలా స్పెషల్ .. ఆమె డేరింగ్ అండ్ డాషింగ్ ఐపీఎస్ ఆఫీసర్ అని నెటిజెన్లు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..