లిఫ్ట్ ఇవ్వలేదని కోపంతో బస్సునే చోరీచేసి ఊరెళ్ళాడు..

  0
  1545

  రాత్రి సమయంలో లిఫ్ట్ ఇచ్చేందుకు లారీలు, బస్సులు ఆపకపోవడంతో ఓ వ్యక్తికి కోపం వచ్చింది. దీంతో ఏకంగా కాంగ్రా డిపోలో ఒక బస్సును చోరీ చేసి.. తన ఊరికి చేరుకున్నాడు. రాకేష్ శర్మ అనే ఇతడు ట్రక్కు డ్రైవర్ కావడంతో, తనకెవరూ లిఫ్ట్ ఇవ్వడం లేదని.. డిపోలోకి వెళ్లి.. బస్సును తీసుకొని వెళ్ళాడు. ఆదివారం రాత్రి ఒకటిన్నర గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. రాకేష్ శర్మ జ్వాలాముఖి పుణ్యక్షేత్రానికి వెళ్లి.. చుట్టూ ఉన్న ఆలయాలను సందర్శించి.. బస్టాండుకు చేరుకునే సమయానికి బస్సులన్నీ వెళ్లిపోయాయి. దారిన వెళ్లే వాహనాలు కూడా ఆపలేదు. దీంతో ఇకలాభం లేదనుకొని.. బస్సు చోరీ చేసి తన స్వగ్రామానికి చేరుకున్నాడు. ఉదయాన్నే బస్సు చోరీ అయిందన్న విషయాన్ని గమనించిన అధికారులు..పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాను పరిశీలించిన పోలీసులు.. రాకేష్ ను అదుపులోకి తీసుకున్నారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.