భార్యపై విసిగిపోయిన భర్త , ఈ లోకంలో తనకు జైలు తప్ప మరో రక్షణ లేదని తీర్మానించుకున్నాడు.. భార్య చేతిలో చిత్రహింసలు పడేకన్నా , పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలే మేలనుకున్నాడు.. అందుకే ఏకంగా ఈ పని చేసాడు.. సంతోషంగా జైలుకెళ్లాడు.. ఇంతకీ అసలు విషయం ఏమిటో చూడండి.. గుజరాత్ లోని రాజ్ కోట్ లో 22 ఏళ్ళ దేవీజీ చావడ అనే యువకుడికి ఇటీవలే పెళ్లయింది.. పెళ్ళాం చిత్రహింసలు మొదలు పెట్టింది.. పాపం తట్టుకోలేక పోయాడు.. ఎదురుతిరిగితే , పోలీసుల వద్ద కేసుపెట్టిస్తాననని చెప్పేది.. లేదంటే రాత్రి గొంతుపిసికి చంపేస్తానని బెదిరించేది.. దీంతో అతడు ఆలోచనలో పడ్డాడు.. ఈ భూమ్మీద ఎక్కడున్నా , తన భార్య తనను వదలదని తీర్మానించుకున్నాడు. అందువల్ల ఏదైనా పెద్దనేరం చేసి జైలుకెళ్లాలనుకున్నాడు. మంచివాడు కాబట్టి ఎలాంటి నేరమూ చేయలేక , చివరకు ట్రాఫిక్ పాయింట్ లో ఉండే పోలీసు పోస్ట్ పెట్రోల్ పోసి తగులబెట్టాడు. పోలీసులు వచ్చే వరకు అక్కడే ఉండిపోయాడు. వాళ్ళువస్తూనే , తానే తగలబెట్టానని , తనపై కేసుపెట్టి , జైల్లో పెట్టమని కాళ్లుపట్టుకున్నాడు. పోలీసులకు మతిపోయింది.. అసలు విషయం ఏమిటని అడిగితే , ఇంట్లో భార్య పెట్టే బాధలుపడలేక , ఇలాంటి పనిచేసి , జైల్లో ఉందామని అనుకున్నట్టు చెప్పాడు..
ఇవీ చదవండి..
రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..
ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..
తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..
పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్