కాటేసిన నాగుపాముని పట్టి ,సీసాలో వేసుకొని..

  0
  343

  గుంటూరు జిల్లాలోని నందివెలుగు గ్రామానికి చెందిన వీరాంజనేయులు అనే వ్యక్తిని ఓ పాము కరిచింది. దీంతో అతడు వెంటనే ఆ పామును పట్టుకొని ఓ డబ్బాలో పెట్టుకొని.. ఆసుపత్రికి వెళ్ళాడు.. దీంతో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది అవాక్కయ్యారు. తనను ఏ పాము కరచిందో తెలియదని.. అందుకే ఇలా పామును పట్టుకొని.. ఆసుపత్రికి తీసుకొచ్చానని చెప్పాడు. ఆ పామును చూసిన స్థానికులు దానిని త్రాచుపాముగా గుర్తించారు. అయితే ప్రస్తుతం వీరాంజనేయులు ఆరోగ్య పరిస్థితి మాత్రం మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. తనకు వైద్యం పూర్తికాగానే త్రాచుపామును జన సంచారం లేని ప్రాంతంలో వదిలేస్తానని వీరాంజనేయులు చెబుతున్నాడు.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..