మహేష్ బాబు కూతురు సితార డాన్స్ అదరగొట్టిందిగా ..

    0
    108

    మహేష్ కూతురు ఇరగదీసింది..

    తండ్రీ కూతుళ్లిద్దరూ కలిసి ఏం చేశారో చూడండి..

    సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న కొత్త చిత్రం.. సర్కారు వారి పాట.. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. గీత గోవిందం మూవీతో భారీ హిట్ కొట్టిన పరశురామ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయికగా ఈ మూవీలో కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన కళావతి సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీనికి తోడు మహేష్ కూడా మంచి ఈజ్ తో ఈ మూవీలో కనిపిస్తున్నాడు. సమ్మర్ లో ఈ మూవీని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకే మూవీకి మెల్లమెల్లగా పబ్లిసిటీ పెంచేస్తున్నారు.

    తాజాగా సర్కారు వారి పాట సినిమా నుంచి ఓ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అయితే ఈ ప్రోమోలో మహేష్ కూతురు సితార తళుక్కున మెరిసింది. మహేష్ కు పోటీగా స్టెప్పులేసింది. పెన్నీ పెన్నీ.. అంటూ సాగే ఈ పాట 20వ తేదీన విడుదల కానుంది. తమన్ మ్యూజిక్ కూడా ఈ మూవీకి పెద్ద అసెట్ కానుంది. తండ్రీ కూతుళ్లిద్దరూ అదరగొట్టేశారని ఈ సాంగ్ ప్రోమో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

    https://www.youtube.com/watch?v=T30RoCkiovE

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..