నేను ఎమ్మెల్యే మనవడిని.. ఇదీ వాడి బైక్ నంబర్ ప్లేట్..

  0
  3837

  కొత్త బైక్‌, కార్ కొనుక్కుంటే .. దాని ముందు వైపో, వెన‌క వైపో… డాడీ గిఫ్ట్, మామ్ గిఫ్ట్ అంటూ త‌మ ఇష్ట‌మైన వారిపేరు స్టిక్క‌ర్ ను అతికించుకోవ‌డం త‌ర‌చూ చూస్తూనే ఉంటాం. కానీ వీడు మాత్రం కాస్త డిఫ‌రెంట్. ఏకంగా తాత‌య్య పేరునే లిఖించేసుకున్నాడు. అది కూడా నెంబ‌ర్ ప్లేట్ మీద‌. ఇంత‌కీ ఆ తాయ్య ఎవ‌రో తెలుసా ?

  త‌మిళ‌నాడు రాష్ట్రం నాగ‌ర్ కోయిల్ లో అంబ‌రీష్ అనే యువ‌కుడు కొత్త‌గా కొనుక్కున్న త‌న బైక్ మీద ఎంఆర్ గాంధీ అని పేరు గ‌ల స్టిక్క‌ర్ ను అతికించుకున్నాడు. అది కూడా నెంబ‌ర్ ప్లేట్ మీద‌. ఎంఆర్ గాంధీ .. ఆ యుడ‌కుడి తాత‌య్య‌. అంతేకాదు నాగ‌ర్ కోయిల్ నియోజ‌క‌వ‌ర్గ బీజేపీ ఎమ్మెల్యే. త‌న తాత‌య్య కొనిచ్చిన బైక్ మీద‌… గ్రాండ్ స‌న్ ఆఫ్ బీజేపీ ఎమ్మెల్యే ఎంఆర్ గాంధీ అని తాత పేరును స్టిక్క‌ర్ గా వేయించుకున్నాడు. ఈ స్టిక్క‌ర్ తో ఉన్న బైక్ ఫోటోస్ సోష‌ల్ మీడియాలో ర‌య్ అంటూ దూసుకుపోతున్నాయి.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..