రాష్ట్రపతి దిగివచ్చి మహావీరుడి భార్యకు ,

  0
  358

  చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర అవార్డు లభించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతోష్ బాబు భార్య, తల్లికి మహావీర్ చక్ర అవార్డును ప్రదానం చేశారు. విశేషం ఏంటంటే.. అవార్డులు అందుకోడానికి సహజంగా అవార్డు పొందినవారు, వారు మరణిస్తే కుటుంబ సభ్యులు రాష్ట్రపతి ఉండే పోడియం వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ రాష్ట్రపతే నేరుగా సంతోష్ బాబు కుటుంబం వద్దకు వచ్చి అవార్డుని అందించారు.

  సూర్యాపేట జిల్లాకు చెందిన సంతోష్‌బాబు.. 16 బిహార్‌ రెజిమెంట్‌కు కమాండింగ్ అధికారిగా వ్యవహరించారు. చైనా బలగాలు దురాక్రమణకు యత్నించగా.. భారత జవాన్లు దీటుగా తొప్పికొట్టారు. ఈ క్రమంలో చెలరేగిన ఘర్షణల్లో సంతోష్‌బాబు సహా 21 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. సంతోష్ బాబు సేవలకు మరణానంతరం మహావీర్‌ చక్ర పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది.

  తెలంగాణలోని సూర్యాపేట పట్టణానికి చెందిన సంతోష్ బాబు 2020 జూన్ 15న గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందారు. ఆ ఘటనలో సంతోష్‌తో సహా 21 మంది సైనికులు వీరమరణం పొందారు. సంతోష్ బాబు భార్య, ఆయన తల్లి.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.