అబ్బా , అంబాసిడర్ ,అదిరే స్టయిల్లో .

  0
  101095

  ఒక‌ప్పుడు కారు అంటే… అంబాసిడ‌ర్ మాత్ర‌మే. రాయ‌ల్టీగా క‌నిపించే ఈ కారు ముందు విదేశీకార్లు కూడా దిగ‌దుడుపే. భ‌ద్ర‌త విష‌యంలో ఈ కారును మించింది లేదు. హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడ‌ర్ కారును మార్కెట్లో విడుద‌ల చేసిన త‌ర్వాత చాలాఏళ్ళు దీని హ‌వా కొన‌సాగింది. అయితే ట్రెండ్ మారింది. కొత్త‌కొత్త కంపెనీలు కొత్త కార్ల‌ను, వేరియంట్ల‌ను మార్కెట్లోకి విడుద‌ల చేయ‌డంతో.., ఇప్పుడు అంబాసిడ‌ర్ కార్లు దాదాపు క‌నుమ‌రుగ‌య్యాయి. అయితే ఆ కారు మీద ఉన్న మోజుతో ఎంతోమంది త‌మ ఇళ్ళ‌ల్లో భ‌ద్రంగా దాచుకున్నారు. మ‌రే కారుకు ఇంత‌టి ప్రాధ‌న్య‌త ఇవ్వ‌లేద‌న‌డంలో కూడా ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.

  ఇలా విశేష సేవలందించిన భార‌త దేశీ దిగ్గజ కారు.. ఇప్పుడు స‌రికొత్త‌గా ముస్తాబై మ‌ళ్ళీ రోడ్ల‌పై ప‌రుగులు తీసేందుకు వ‌స్తోంది. అయితే ఇది ఎల‌క్ట్రిక్ కారు మాత్ర‌మే. ఈఏడాది చివ‌రినాటికి ఇండియ‌న్ మార్కెట్లోకి రాబోతోంది. ఈ కారు దేశీయ ప‌రిజ్ఞాన‌మే అయినా స్విట్జ‌ర్లాండ్ లో అభివృద్ది చేశారు. దీని ధ‌ర‌ను ఇంకా ఖ‌రారు చేయ‌లేదు. చూసేందుకు మాత్రం రిచ్ లుక్ తో, ల‌గ్జ‌రీగా క‌నిపిస్తోంది. బీఎండ‌బ్ల్యూ, ఆడి కార్ల‌ను త‌ల‌పించే రీతిలో ఎల‌క్ట్రిక్ అంబాసిడ‌ర్ కారు రూపొందింది.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.