టెస్లా, కియా..ఎందుకు ? సూపర్ ఎలెక్ట్రిక్ కారు నేనే చేసుకున్నా.

  0
  18469

  పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగిన నేపథ్యంలో అందరూ ఎలక్ట్రిక్ వాహనాలకోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ రేట్లు కూడా భారీగానే ఉన్నాయి. కార్లు కూడా రేటు ఎక్కువే. దాంతోపాటు చార్జింగ్ పాయింట్లు కూడా తక్కువగా ఉండటంతో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ లేదు. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ లో హిమాన్షు అనే విద్యార్థి సొంతగా ఎలక్ట్రిక్ కార్ తయారు చేసి శెహభాష్ అనిపించుకుంటున్నాడు.

  దీని ప్రత్యేకతలివే..
  ఒక్కసారి చార్జింగ్ పెడితే 185 కిలోమీటర్ల ప్రయాణం..
  గంటకు 50 కిలోమీటర్ల వేగం..
  ఫుల్ చార్జింగ్ కి 4 గంటల సమయం, 30 రూపాయల కరెంటు ఖర్చు.
  రిమోట్ కంట్రోల్
  ఫీజు సిస్టమ్ ఉంటుంది, తెఫ్ట్ అలారమ్, బ్యాటరీ పవర్ మీటర్, స్పీడో మీటర్
  కారులో ఐదుగురు కూర్చుని వెళ్లేందుకు అవకాశం.
  అన్నీ కలిపి దీని ఖర్చు ఎంతఅనుకున్నారు కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే.

  ఈ కారు కోసం ఒక్క విడిభాగాన్ని కూడా ఇతర ఏ కంపెనీ కార్లనుంచి సేకరించలేదు హిమాన్షు. అన్నీ సొంతగా తయారు చేసుకున్నాడు. లైట్లు, స్టీరింగ్, ఇతర విడిభాగాలన్నీ తనకు నచ్చినట్టు డిజైన్ చేసుకున్నాడు. జీప్ మోడల్ లో ఉండే ఈ కారులోనే అతడు కాలేజీకి వెళ్లి వస్తున్నాడు.

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.