అదృష్టవంతుడు.. చావుని కళ్లజూసి బతికాడు..

  0
  112198

  తిరుపతి స్విమ్స్ వైద్యులు అత్యంత అరుదైన ఆపరేషన్ ద్వారా శరీరంలో దిగబడిన ఒక ఇనుప రాడ్ ను తొలగించారు. విజయవాడ, గుంటూరు.. డాక్టర్లు తమ వల్ల కాదని చేతులెత్తేస్తే ఆ పేషెంట్ ను తిరుపతికి తీసుకొచ్చిన తర్వాత వైద్యులు ఈ కేసుని ఓ ఛాలెంజ్ గా తీసుకని ఆపరేషన్ ద్వారా ఆ రాడ్డుని తొలగించారు. కృష్ణాజిల్లా కైకలూరుకి చెందిన తాపీ మేస్త్రీ లక్ష్మయ్య ఒక భవన నిర్మాణ పనుల్లో ఉండగా కిందపడ్డాడు. తొడభాగంలో గుచ్చుకున్న ఇనుప కడ్డీ భుజం లోనుంచి బయటకు వచ్చింది. దీన్నిబట్టి ఎంత ప్రమాదకరమైన పరిస్థితో అర్థం చేసుకోవచ్చు. అతడిని కైకలూరు ఆస్పత్రికి తీసుకొచ్చారు, అక్కడినుంచి విజయవాడకు తీసుకొచ్చారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు కూడా తమ వల్లకాదని చెప్పడంతో గుంటూరు తీసుకెళ్లారు. గుంటూరు వైద్యులు కూడా కాదనడంతో తిరుపతి స్విమ్స్ కి తరలించారు. స్విమ్స్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ వెంకట్రామిరెడ్డి, డాక్టర్ సత్యవది, డాక్టర్ మధుసూదన్ బృందం ఆపరేషన్ చేసి దాదాపు 4 అడుగుల పొడవు ఉన్న 10ఎంఎం రాడ్ ను జాగ్రత్తగా బయటకు తీశారు. అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్ చేసి బాధితులకు ప్రాణం పోశారు. శరీరంలోని ఇతర అవయవాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుని ఈ ఇనుపరాడ్ ను బయటకు తీశామని వైద్యులు తెలిపారు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.